Homeట్రెండింగ్ న్యూస్Millet Queen Of India: బాలీవుడ్ హీరోయిన్లను సైతం పక్కనెట్టి అంబాసిడర్ అయిన యువతి.. ప్రత్యేకత...

Millet Queen Of India: బాలీవుడ్ హీరోయిన్లను సైతం పక్కనెట్టి అంబాసిడర్ అయిన యువతి.. ప్రత్యేకత ఏంటంటే?

Millet Queen Of India: ఏదైనా సంస్థకు లేదా కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎవరినైనా పెట్టుకోవాలంటే సెలబ్రిటీలను, సినిమా స్టార్లను, స్పోర్ట్‌ స్టార్లను పెట్టుకుంటారు. కానీ, భారత ప్రభుత్వం మాత్రం ఓ గిరిజన యువతిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిర్ణయించింది. మిల్లెట్స్‌ సాగును ప్రోత్సహిస్తున్న కేంద్రం.. ఆ మిల్లెట్స్‌ సాగుపై మంచి పట్టు ఉన్న మధ్యప్రదేశ్‌లోని బైగా గిరిజన యువతి లహరీబాయిని ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ ది మిల్లెట్‌’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఇప్పటి వరకు ఆమె 150 రకాల అరుదైన మిల్లెట్స్‌తో బీజ్‌ బ్యాంకు ఏర్పాటు చేశారు.

అమ్మమ్మ నుంచి పాఠాలు నేర్చుకుని..
లహరీబాయి మధ్యప్రదేశ్‌లోని బైగా (వైద్యుడు) గిరిజన సంఘానికి చెందిన యువతి. ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహం. ఈ తెగకు చెందిన ప్రజలు తమ పర్యావరణం, దాని జీవవైవిధ్యం గురించి లోతైన జ్ఞానాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు, వారు మౌఖిక సంప్రదాయాల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి పంపుతారు. దిండోరి జిల్లాలోని సిల్పాడి అనే మారుమూల గ్రామానికి చెందిన లహరి తన బామ్మ మాటలతో ప్రేరణ పొందింది,
కనుమరుగవుతున్న ధాన్యం మిల్లెట్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి లహరీబాయి తన అమ్మమ్మ నుండి పాఠాలు నేర్చుకుంది. తర్వాత దాని విత్తనాలను సంరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. 18 సంవత్సరాల వయస్సులో విత్తనాలు సేకరించడం ప్రారంభించింది. ఆమె ఇప్పుడు కూడా సమీపంలోని గ్రామాలలో తిరుగుతూ అడవులు మరియు పొలాల నుంచి విత్తనాలను సేకరిస్తూనే ఉంది.

మిల్లెట్సే సర్వస్వం..
ఇక లహరీబాయి ఇంటికి వెళితే.. అలంకారప్రాయంగా కనిపించే రకరకాల మినుము గింజలు ఇంటి పైకప్పుకు వేలాడుతుంటాయి. మిల్లెట్‌ అనేది మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కలిగి ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మధుమేహం నిరోధించడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎప్పుడూ పాఠశాలకు వెళ్లని గిరిజన మహిళ ఈ విత్తనాలను సంరక్షించడంలో ఉన్న ప్రాముఖ్యతను చాలా కాలం క్రితం అర్థం చేసుకుంది.

150 రకాల మిల్లెట్స్‌ సేకరణ..
ఇక లహరీబాయి వయసు 27 ఏళ్లు 17 ఏళ్ల నుంచి ఆమె మిల్లెట్స్‌ సేకరణ ప్రారంభించింది. ఇప్పటి వరకు 150 రకాల కన్నా ఎక్కువ మిల్లెట్స్‌ సేకరించింది. కోడో, కుట్కి, సికియా, సల్హార్, సావా మరియు చేనాతో సహా 150 కంటే ఎక్కువ రకాల అరుదైన మిల్లెట్స్‌ లహరీబాయి వద్ద ఉన్నాయి. చాలా రకాల మిల్లెట్స్‌ అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించుకోవాలని చెబుతుంది లహరీబాయి.
కిలో విత్తనాలు..
ఇక ఎవరైనా మిల్లెట్స్‌ సాగు చేస్తే.. లహరీ బాయి వారికి కిలో విత్తనాలు ఉచితంగా ఇస్తుంది. తిరిగి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ రైతుల నుంచి కిలోన్నర తీసుకుంటుంది. కొందరు ఆమెకు కొంతభాగం బహుమతిగా కూడా ఇస్తారు. డబ్బు సంపాదించడం కోసం ఇలా చేయడం లేదని, ఎక్కువ విత్తనాలు సేకరించడం కోసమేనని లహరీబాయి చెప్పింది.

మిల్లెట్‌కు అంబాసిడర్‌గా మారారు..
లహరీబాయి మిల్లెట్స్‌ సేకరణ, సంరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది మిల్లెట్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా గుర్తించింది. భారత ప్రభుత్వం దేశాన్ని మిల్లెట్‌సాగు, పరిశోధనలకు ప్రపంచ హబ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తోంఇ. ఈ క్రమంలో లహరీబాయిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular