
Madhu Yadav: అతడో పాల వ్యాపారి. కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు లేని సెక్యూరిటీ ఉంటుంది. అది కూడా ప్రభుత్వం అందించిన సెంట్రల్ సెక్యూరిటీ కావడం గమనార్హం. ఎందుకంత దర్పం అంటే ప్రతి వ్యాపారంలో శత్రువులు ఉంటారు కదా మా వ్యాపారంలో కూడా శత్రువులు ఉన్నారు. అందుకే ఈ సెక్యూరిటీ అని చెబుతున్నాడు. మొత్తానికి పాల వ్యాపారికి కూడా సెంట్రల్ సెక్యూరిటీ ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. పాల వ్యాపారి అంటే మామూలు బిజినెస్ మ్యాన్ కాదు. అతడి వ్యాపారం రూ. లక్షల్లోనే ఉంటోంది. అందుకే ఈ సెక్యూరిటీ. కష్టపడి పని చేసుకునే వారికి కూడా సెక్యూరిటీ ఎందుకనే అనుమానం రావొచ్చు. అతడికి సెంట్రల్ సెక్యూరిటీ ఎలా ఇచ్చిందనే సందేహమూ వస్తుంది నిజమే. అతడికి ఉన్నపరిచయాలతోనే సెక్యూరిటీ సంపాదించుకున్నాడు. ఇలా తన వ్యాపారంలో ఎన్నో స్థాయిలు దాటుతున్నాడు.
ఒక రాష్ట్రంలోనే కాదు హర్యానా, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కూడా అతడికి వ్యాపారాలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. అతడి వద్ద ఓ 150 మంది గ్రూప్ ఉంది. దీంతో వారు రోజు వ్యాపారంలో లావాదేవీలు చూసుకుంటూనే ఉంటారు. అతడు మాత్రం వివిధ రాష్ర్టాలు పర్యటించడానికి సొంత రవాణా సదుపాయం కలిగిన విమానమే ఉందంటే అతిశయోక్తి కాదు. కేవలం స్నేహితులను కలవడానికే అందులో వెళతాడు.

ఇదంతా ఓ సినిమాలా అనిపిస్తోంది. అతడి వ్యాపారంలో అంత లాభం ఉంటుంది. ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందించడమే తమ ధ్యేయమని చెబుతున్నాడు. మంచిగా పని చేసుకుంటే ఎందులో అయినా లాభం ఉంటుంది. కానీ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే ఊచలు లెక్కపెట్టడం ఖాయమని చెబుతున్నాడు. ఇలా తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని వెల్లడిస్తున్నాడు.
అతడి ఒంటిపై ఓ యాభై లక్షల విలువ చేసే బంగారం ఉంటుంది. అచ్చం రాజకీయ నేతలా సెక్యూరిటీ మెయింటెన్ చేస్తూ తిరుగుతుంటాడు. కానీ రాజకీయ నేత కాదు. రాజకీయాల్లో నైతిక విలువలు నశించాయని అందుకే తనకు రాజకీయాలంటే పడవని పేర్కొనడం గమనార్హం. మనసు పెట్టి పనిచేస్తే ఎందులో అయినా రాణించొచ్చు అని మధు తన మనసులోని మాటలను పంచుకున్నాడు.