CM KCR About Mahatma Gandhi: తాను దండం పెట్టించుకోవడం తప్ప.. తాను ఒకరికి దండం పెట్టడం కేసీఆర్‌కు పెద్దగా నచ్చదు. స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నేతల విషయంలోనూ ఆయన ఆలాగే వ్యవహరిస్తారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, భగత్‌సింగ్, జగ్జీవన్‌రామ్, బాలగంగాధర్ తిలక్‌తోపాటు తెలంగాణ ఉద్యమ నేతలు అయిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ వంటి నేతల చిత్రపటాలకు కూడా ఆయన నమస్కరించరు. జయంతి వర్ధంతి వేడుకల్లోనూ పాల్గొనరు. అంబేద్కర్ చిత్రపాటనికి నమస్కరించాల్సి వస్తుందని ఇటీవల దేశ గణతంత్ర వేడకలను కూడా మొక్కుబడిగా నిర్వహించేందుకు కోవిడ్ సాకు చూపారు. కానీ, తాను మాత్రం తెలంగాణ జాతిపితగా, దేశ్‌కీ నేతగా లిపిపించుకుంటున్నారు. అందరూ తనకు నమస్కరించాలని, పార్టీ నేతలైతే పాదాభివందనం చేయాలని ఆశిస్తారు. అటాంటి తెలంగాణ జాతి పితకు సడెన్‌గా ఇప్పుడు దేశ జాతిపిత అయిన మహాత్మాగాంధీ సడెన్‌గా గుర్తొచారు. జనవరి 30 గాంధీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కుల, మతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజల శ్రేయస్సు తన మతమని భావించిన మహాత్మాగాంధీ ఆశయాలు ప్రస్తుతం దేశానికి తక్షన అవసరమని పేర్కొన్నారు. జనవరి 30న (అమరవీరుల దినోత్సవం) జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహాత్మాగాంధీ దేశ ప్రగతికి ఎల్లవేళలా మార్గదర్శకంగా నిలుస్తారని పేర్కొన్నారు. లక్ష్యసాధనలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి విజయ తీరాలకు చేరుకోవాలనే స్ఫూర్తిని గాంధీజీ జీవితం నుంచి నేర్చుకోవాలని ఆయన ఉద్బోధించారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని తెలిపారు.

తొమ్మిదేళ్ల చరిత్రలో తొలిసారి..
తెలంగాణ తొమ్మిదేళ్ల చరిత్రలో సీఎం కేసీఆర్ మహాత్ముడిని స్మరించుకోవడంపై ప్రస్తుతం తెలంగాణలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ జాతీయ నేతల ఊసెత్తని కేసీఆర్‌కు ఇప్పుడు సడెన్‌గా గాంధీ గుర్తుకు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ తప్పనిసరి పరిస్థితిలోనే గాంధీని స్మరించుకున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా స్వరాష్ట్రం కోసం అందరి ఇళ్లకు వెళ్లి మరీ మద్దతు కూడగట్టారని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అయితే తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కూడా హామీ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. అవసరం కోసం గొగలి పురుగును అయినా కౌగిలించుకుని అవసరం తీరాక తీసిపారేయడం కేసీఆర్ నైజమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గాంధీమార్గంలో తెలంగాణ సాధించిన తర్వాత గాంధీని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తర్వాత అంబేద్కర్‌ను కేసీఆర్ విస్మరించిన తీరును ఉదహరిస్తున్నారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి..
ఇదిలా ఉంటే, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో సోమవారం గాంధీ వర్ధంతి నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు కూడా మహాత్ముడికి నివాళులర్పించారు. 75 ఏళ్ల క్రితం ఇదే రోజున స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా తీవ్రవాదం తన నీచమైన ముఖాన్ని గాడ్సేగా చూపించిందని ఆయన ట్వీట్ చేశారు. ‘‘బాపు గారికి మనం అర్పించే ఉత్తమమైన నివాళులు, శాంతి, మత సామరస్యానికి సంబంధించిన ఆయన ఆశయాలను ఆచరించడం అని, మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా మనం గుర్తుచేసుకుందాం’’ అని రాసుకొచ్చారు. అసెంబ్లీ, కౌన్సిల్ కార్యాలయాల ఆవరణలోనూ ఆయా సభాపతులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా గాంధీకి నివాళులర్పించారు.

మొత్తానికి జాతీయ రాజాకీయాల కోసం ఏ అంశాన్ని వదలని బీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి గాంధీజీని స్మరించుకోవడం గమనార్హం.