Bigg Boss 6 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలేకి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. శుక్రవారం అర్ధరాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ముగిశాయి. ఆడియన్స్ తమ ఫేవరేట్ కంటెస్టెంట్ కి ఓట్లు వేశారు. వారే టైటిల్ అందుకోవాలని కోరుకుంటున్నారు. ఫైనల్ కి వీక్ కి ఆరుగురు కంటెస్టెంట్స్ వెళ్లారు. వారిలో శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్ళిపోయింది. ఎవరు ఎలిమినేట్ కావాలి అంటుకుంటున్నారో ప్రతి ఇంటి సభ్యుడు ఒకరి పేరు సూచించాలని బిగ్ బాస్ చెప్పారు. మెజారిటీ సభ్యులు కీర్తి పేరు సూచించారు. అయితే కంటెస్టెంట్స్ ఒపీనియన్ కాకుండా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా శ్రీసత్యను ఎలిమినేట్ చేశారు.

ఇక కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్, శ్రీహాన్ బిగ్ బాస్ తెలుగు 6 టాప్ 5 కంటెస్టెంట్స్ గా అవతరించారు. వీరే ఫైనలిస్ట్స్ కూడాను. ఈ ఐదుగురిలో ఒకరు టైటిల్ సొంతం చేసుకోనున్నారు. విన్నర్ బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ తో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ, రూ. 25 లక్షల విలువైన సువర్ణభూమి ఫ్లాట్, మారుతి సుజుకీ బ్రీజా కార్ గెలుచుకోనున్నారు. ఈ మొత్తం విలువ రూ. 85 లక్షల వరకూ ఉంటుంది.
వంద రోజుల కష్టానికి విన్నర్ పెద్ద మొత్తంలోనే సొంతం చేసుకోనున్నారు. ఫైనల్ హీట్ మొదలుకాగా… విన్నర్ ఎవరనే ఊహాగానాలు మొదలైపోయాయి. సోషల్ మీడియాలో జనాలు తమ ఫేవరేట్ కంటెస్టెంట్ కి అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. మెజారిటీ వర్గాల అంచనా ప్రకారం రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అంటున్నారు. సింగర్ ఆ అతనికి ఫేమ్ ఉంది. మాటతీరు, ఆటతీరు, పక్కన పెడితే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ తో పాటు పీఆర్ టీమ్, బిగ్ బాస్ నిర్వాహకుల మద్దతు… అన్నీ కలిసొచ్చాయనేది పరిశ్రమలో టాక్.

రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్ ఇది ఫిక్స్ అంటున్నారు. ఇక రన్నర్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానానికి పోటీపడుతున్న ఆదిరెడ్డి, శ్రీహాన్ రోహిత్ ముగ్గురూ స్ట్రాంగ్. అయితే శ్రీహాన్ రేవంత్ తో టైటిల్ కోసం పోటీపడతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్రీహాన్ కంటే ఆదిరెడ్డి, రోహిత్ హౌస్లో క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్నారు. జెంటిల్మెన్ గా పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ శ్రీహాన్ రన్నర్ కావచ్చనే వాదన వినిపిస్తోంది. ఇక టాప్ ఫైవ్ పొజిషన్ తో కీర్తి సరిపెట్టుకుందట.