
Dan Bilzerian: అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. కానీ దురదృష్టం తలుపు తీసే వరకూ కొడు తుంది అని పెద్దలంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏది పట్టుకున్నా బంగారమే. దీంతో ఇతడు ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక జూదగాడుగా ఖ్యాతిగాంచాడు.. కేవలం జూదంతోనే కోటీశ్వరుడు అయ్యాడు..పోకర్ కింగ్ గా ప్రపంచం పిలిచే ఈ వ్యక్తి ఆస్తుల విలువ పదివేల కోట్లకు పైగానే.
ఖరీదైన జూదగాడు
ఈ ప్రపంచంలో జూదాన్ని చట్టబద్ధం చేసిన దేశాలు చాలా ఉన్నాయి. ఆ దేశాల్లో కాసినోలకు వెళ్లి చాలామంది జూదం ఆడతారు. గెలిస్తే గెలుస్తారు.. లేకుంటే ఓడిపోతారు. కానీ ఇతగాడు అలా కాదు. ఇతడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జూదగాడు.. ఇతడి పేరు డాన్ బిల్జెరియన్.. పేకాట ఆడి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాడు. అందుకే ఇతడిని పేకాటకు రారాజు అని పిలుస్తుంటారు. పేకాటరాయుడిగా మాత్రమే కాదు హాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేశాడు. ఈ విషయం అతి పది మందికి మాత్రమే తెలుసు.. డాన్ కు దాదాపు పదివేల కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అతను పేకాట ఆడటం ద్వారానే ఆస్తులు కూడా పెట్టాడు. మొన్నటికి మొన్న ఒక్క రోజులోనే 11 మిలియన్ డాలర్లు అంటే 83 కోట్లు సంపాదించాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.
తుపాకులు కూడా
డాన్ కు పేకాట మాత్రమే కాదు తుపాకులు, లగ్జరీ వాహనాలు అంటే చాలా ఇష్టం.. ఇతను ఒకటి కంటే ఎక్కువ ఖరీదైన వాహనాలు కలిగి ఉన్నాడు. అంతేకాదు తుపాకుల ఫ్యాక్టరీ కూడా ప్రారంభించాడు. ఇతని వద్ద అత్యంత ఖరీదైన తుపాకులు ఉన్నాయి.. ఇవే కాదు ఇతడు విలాస పురుషుడు కూడా.

అపారమైన ధనం ఉండడంతో అందమైన అమ్మాయిలతో షికారు చేస్తూ ఉంటాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇవి తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. అందమైన అమ్మాయిలు అతడి చుట్టూ ఎప్పుడూ ఉంటారు.. విస్కీ తాగుతూ, సిగరెట్లు కాల్చుతూ వారితో సముద్రపు దీవుల్లో, ఎడారి ఇసుక దిబ్బల్లో, దట్టమైన అటవీ ప్రాంతాల్లో గడుపుతూ ఉంటాడు. ఇవన్నీ చూసి చాలామంది విలాసమంటే నీదేరా నాయనా అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు. చాలామంది మేం ప్లే బాయ్ ల మని చెప్పుకుంటారు కానీ.. డాన్ మాత్రం ఎక్కడ కూడా తాను ప్లే బాయ్ అని చెప్పుకోడు.. ఎందుకంటే అతను తన చేతల ద్వారా చూపిస్తాడు. అందరి నోర్లూ మూయిస్తాడు.
