
Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్నాడు.ఇన్ని రోజులు కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే భారీ మార్కెట్ ని సంపాదించుకున్న ధనుష్, ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ‘సార్’ సినిమాతో తెలుగు లో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి తన మార్కెట్ ని విస్తరింపచేసాడు.
కేవలం మూడు రోజుల్లోనే 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిలను రాబట్టే అవకాశం ఉందట.ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ నేడు హైదరాబాద్ లో జరిగింది.ఈ ఈవెంట్ కి ధనుష్ తప్ప మిగిలిన మూవీ టీం మొత్తం హాజరైంది.ఇదంతా పక్కన పెడితే ధనుష్ ఈరోజు చెన్నై లో కొన్న ఇల్లు గురించి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటుంది.

ఇప్పటి వరకు ఆయన తన బ్యాంకు లో సేవ్ చేసుకున్న డబ్బులతో పోయెస్ గార్డెన్స్ లో 150 కోట్ల రూపాయిలను ఖర్చు పెట్టి ఈ ఇల్లుని నిర్మించాడు.పోయెస్ గార్డెన్స్ లో ఇల్లు కట్టుకొని విలాసవంతమైన జీవితం గడపాలని ప్రతీ స్టార్ కి ఉండే ఒక కోరిక.అలాంటి ప్రాంతం లో ధనుష్ ఎంతో ఆశపడి ఈ ఇల్లుని నిర్మించాడు.మరో విశేషం ఏమిటంటే ఈ ఇంటి పట్టాలను తన తల్లి పేరు మీద వ్రాయించాడట.ఇది ఎంతో గొప్ప విషయం అనే చెప్పాలి.
ధనుష్ ఇదివరకు దాదాపుగా 50 సినిమాలకు పైగానే చేసాడు.సూపర్ స్టార్ రజినీకాంత్ కి అల్లుడు కాకముందే ఆయన తమిళ సినిమా ఇండస్ట్రీ లో హిట్టు మీద హిట్టు కొడుతూ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు.ఒక్కో సినిమాకి 20 కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకునే ధనుష్ డబ్బులను పోగు చేసి ఇంత ఖరీదైన ఇల్లుని కొనడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.