GSDP: కేసీఆర్ చెప్పినట్టు కాదు కానీ.. సౌత్ లో ఈ రాష్ట్రమే తోపు

ప్రస్తుత ధరల ప్రకారం తమిళనాడు రాష్ట్రం 24.8 లక్షల కోట్ల జీఎస్డీపీ తో దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. దీని తర్వాత కర్ణాటక 22.4 లక్షల కోట్లు, తెలంగాణ 13.3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 13.2 లక్షల కోట్లు, కేరళ 10 లక్షల కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Written By: Bhaskar, Updated On : May 6, 2023 6:44 pm

GSDP

Follow us on

GSDP: “తెలంగాణ చేస్తోంది.. దేశం అనుసరిస్తోంది. ఆర్థికంగా మనమే నెంబర్ వన్, అన్నింటా మనమే నెంబర్ వన్” అని కెసిఆర్ అంటాడు కానీ.. ఇప్పటికీ కొన్ని విషయాల్లో తెలంగాణ వెనుకంజలోనే ఉంది. కెసిఆర్ చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం నిజం.. దేశ జీడీపీ లో 30% వాటా ఐదు దక్షిణాది రాష్ట్రాలదే. అంతేకాదు రిజర్వ్ బ్యాంక్ వివిధ రకాల సూచీలలో ఈ ఐదు రాష్ట్రాల దరిదాపుల్లో మిగతా రాష్ట్రాలు లేవంటే అతిశయోక్తి కాదు.. ఇక కేసీఆర్ లాంటి నాయకుల మాటలు పక్కన పెడితే.. రిజర్వ్ బ్యాంక్ వెలువరించిన నివేదికల ప్రకారం.. ఐదు రాష్ట్రాలు ఆర్థికంగా గొప్ప పరిణతి సాధించాయి.. ఏ ఏ రాష్ట్రం ఎందులో ముందు ఉందో మీరూ చదివేయండి.

తమిళనాడు టాప్

ప్రస్తుత ధరల ప్రకారం తమిళనాడు రాష్ట్రం 24.8 లక్షల కోట్ల జీఎస్డీపీ తో దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. దీని తర్వాత కర్ణాటక 22.4 లక్షల కోట్లు, తెలంగాణ 13.3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 13.2 లక్షల కోట్లు, కేరళ 10 లక్షల కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.. ఇక తలసరి ఆదాయ పరిమితిలో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయాన్ని ₹2,75,443 నమోదు చేసింది. తెలంగాణ తర్వాత కర్ణాటక ₹2,63,623, తమిళ నాడు ₹2,41,131, కేరళ ₹2,30,601, ఆంధ్ర ప్రదేశ్ ₹2,07,771 స్థానాళ్లో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలు జాతీయ సగటు ₹1,50,007 కంటే ఎక్కువ సాధించాయి.

రుణ నిష్పత్తిలో

ఇక రుణ నిష్పత్తి విషయానికొస్తే తెలంగాణ జీఎస్డీపీ నిష్పత్తిలో తెలంగాణ 25.3% రుణాన్ని కలిగి ఉంది. కర్ణాటక 27.7%, ఆంధ్రప్రదేశ్ 32.8%, కేరళ 37.2% నిష్పత్తిని కలిగి ఉన్నాయి. రాష్ట్ర పన్ను ఆదాయాల విభాగంలో తమిళనాడు 1,26,644 కోట్ల పన్ను రాబడులతో మొదటి స్థానంలో ఉంది. కర్ణాటక 1,11494 కోట్లు, తెలంగాణ 92,910, ఆంధ్రప్రదేశ్ 85,265, కేరళ 71,833 కోట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఆర్థిక క్రమశిక్షణ విభాగంలో కర్ణాటక(2.8%) అతి తక్కువ ఆర్థిక లోటు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ 3.2%, తమిళ నాడు 3.8%, తెలంగాణ 3.9%, కేరళ 4.2% తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెచ్చిన అప్పులకు చెల్లించిన వడ్డీ విభాగంలో తెలంగాణ అతి తక్కువ (11.3%) వడ్డీ చెల్లింపులు చేపట్టింది.. ఆ తర్వాత కర్ణాటక 14.3%, ఆంధ్రప్రదేశ్ 14.3%, కేరళ 18.8%, తమిళనాడు 21% లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

పారిశ్రామికంగా..

ఇక ఈ ఐదు రాష్ట్రాల్లో పారిశ్రామికంగా తమిళనాడు రాష్ట్రం ముందంజలో ఉంది.. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి.. ఇక ఐటి రంగంలో దేశ రాజధానిగా బెంగళూరు కొనసాగుతోంది. ఐటీ ఉత్పత్తుల్లో ఏటికేడు వృద్ధి సాధిస్తూ ఇండియన్ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి పొందుతోంది. ఆ తర్వాత ఇస్తాను తెలంగాణ దక్కించుకుంది. ఇక తమిళనాడు మూడో స్థానంలో కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్, కేరళ చివరి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆక్వా రంగం విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్, కేరళ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఏ రంగంలో చూసుకున్నా దేశ సగటుతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. అయితే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో మాత్రమే బిజెపి అధికారంలో ఉంది..