Atrocities: ఇంతటి దారుణాలు.. కనీవినీ ఘోరాలు.. ఈ మృగాళ్లకు అరబ్ తరహా శిక్షలు వేస్తే బుద్ధి వస్తుందేమో..

ఇటీవల నంద్యాల జిల్లాలో ఓ మైనర్ పై ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ బాలిక మృతదేహాన్ని సమీపంలో ఉన్న ఓ నదిలో పడేశారు. ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ముగ్గురు బాలురపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం కోర్టుకు తరలిస్తే.. కోర్టు వారిని జువైనల్ హోమ్ కు తరలించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 18, 2024 9:55 am

Atrocities

Follow us on

Atrocities: దారుణం.. ఘోరం.. పైశాచికత్వం.. ఆకృత్యం.. దుర్మార్గం.. కర్కశత్వం.. కసాయి తత్వం.. ఏం పేర్లు పెడదాం.. అవి కూడా తక్కువే.. జరుగుతున్న ఘోరాలు అటువంటివి కదా.. ఆరు నెలల పసికందు .. పండు ముదుసలి.. దొడ్లో కట్టేసిన గేదె వరకు..దేన్నీ వదలడం లేదు కదా.. ఈ ఆకృత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గులకు ఎటువంటి శిక్ష వేయాలి? ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే వారిలో మార్పు వస్తుంది? ఇంకొకళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి..

దారుణాలు

ఇటీవల నంద్యాల జిల్లాలో ఓ మైనర్ పై ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ బాలిక మృతదేహాన్ని సమీపంలో ఉన్న ఓ నదిలో పడేశారు. ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ముగ్గురు బాలురపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం కోర్టుకు తరలిస్తే.. కోర్టు వారిని జువైనల్ హోమ్ కు తరలించింది. పోలీసులు ఆ బాలుర తల్లిదండ్రులపై కూడా కేసును నమోదు చేశారు. పట్టుమని పదో తరగతి లోపు చదివే పిల్లలు ఇంతటి దారుణానికి పాల్పడటం ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ పిల్లలు సెల్ ఫోన్ లలో ఆ తరహా వీడియోలు చూసి.. ఆ బాలికపై అకృత్యానికి పాల్పడ్డారని పోలీసుల అంతర్గత విచారణలో తేలింది.

నెలల చిన్నారిపై..

ఇక ఇదే ఏపీలోని ఓ జిల్లాలో ఓ నెలల వయసు ఉన్న చిన్నారి పై ఓ 60 ఏళ్ల వృద్ధుడు పాడుపనికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ చిన్నారి కి విపరీతమైన రక్తస్రావం జరిగింది. దీంతో ఆ చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఫోక్సో చట్టం కింద ఆ వృద్ధుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గేదె ను కూడా వదల లేదు

ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన సీతారామయ్య అనే రైతు తన గేదెను దొడ్లో కట్టేశాడు. సమీప గ్రామానికి చెందిన కొంతమంది విపరీతంగా మద్యం తాగి.. ఆ మత్తులో గేదె పై అత్యాచారానికి పాల్పడ్డారు.. ఆ సమయంలో గేదె కాళ్లను తాళ్లతో కట్టేశారు. ఉదయం లేచి సీతారామయ్య గేదెను చూడగా.. దాని మర్మాంగం ఉబ్బి ఉంది. తీవ్రంగా వాయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి గేదెను పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో గంజాయి మత్తులో మరో దారుణం

పై ఘటనలు సమాజంలో మృగాళ్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి నిదర్శనంగా నిలిస్తే.. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో మరో దారుణం చోటుచేసుకుంది.. గంజాయి మత్తులో ఓ యువకుడు.. బిస్కెట్లు ఇస్తానని చెప్పి కో ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు. ఆపై ఆపాలికను హతమార్చాడు. దొరవారి సత్రం మండలానికి బీహార్ నుంచి కొంత మంది వచ్చారు. ఇక్కడ ఒక రైస్ మిల్లులో వారు పనిచేస్తున్నారు. అందులో ఒక కుటుంబం కూడా పనిచేస్తోంది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అందులో చిన్న కుమార్తె (8) కు బిస్కెట్లు ఇస్తానని.. రైస్ మిల్లులో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన దిలీప్ (20) ఆ బాలికను తీసుకెళ్లాడు. మధ్యాహ్నం మిగిలిన నుంచి వచ్చిన ఆ తల్లిదండ్రులకు కుమార్తె కల్పించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా ఆ బాలిక జాడ కనిపించలేదు. చివరికి రైస్ మిల్ పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో ఆ బాలిక మృత దేహం కనిపించడంతో మేకల కాపర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీతో డిఎస్పి శ్రీనివాసరెడ్డి, సిఐలు జగన్మోహన్రావు, శ్రీనివాసులు రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

బాలిక నోట్లో గాయాలు..

బాలిక మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆమె నోటి వద్ద, ఇతర శరీర భాగాల్లో గాయాలు అయినట్టు గుర్తించారు. నిందితుడు ముందుగా అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు. సమీపంలో ఉన్న సిసి కెమెరాలు దిలీప్ బాలికను తీసుకెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దిలీప్ ను విచారిస్తున్నారు. అయితే తనకు ఏమీ తెలియదని, బాలికకు బిస్కెట్లు కొనిచ్చేందుకు మాత్రమే తీసుకెళ్లానని.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని దిలీప్ పోలీసులతో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే గంజాయి మత్తులో నిందితుడు ఆ బాలికపై అత్యాచారం, హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తారు. అయితే మంగళవారం రాత్రి దిలీప్ గంజాయి మత్తులో బాలిక తండ్రితో గొడవపడ్డాడు. ఆ మరుసటి రోజే ఈ దారుణం చోటు చేసుకోవడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరవైపు దిలీప్ ను కఠినంగా శిక్షిస్తామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

అరబ్ తరహా శిక్షలే శరణ్యమా

కాగా, అరబ్ దేశాలలో ఇలాంటి దారుణాలకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు విధిస్తారు. నేరాల తీవ్రత ఆధారంగా అంగచ్చేదనం చేస్తారు.. కొన్ని కేసుల్లో అయితే మరణ శిక్ష విధిస్తారు. ఏపీలో వరుసగా ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కఠిన శిక్షలు విధించాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.