Sunrise: మన దేశంలో సూర్యుడు మొదట ఎక్కడ ఉదయిస్తాడు? ఎక్కడ అస్తమిస్తాడో తెలుసా?

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగడం కామన్. భూమి, సూర్యచంద్రుల కక్షలు ఇప్పటికీ అద్భుతంగానే అనిపిస్తాయి. ఇక ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు.

Written By: Swathi, Updated On : March 5, 2024 9:48 am

Sunrise

Follow us on

Sunrise: చిన్నప్పుడు పుస్తకాల్లో ఎన్నో ప్రశ్నలు వాటికి జవాబులు తెలుసుకుంటాం. కానీ అవి గుర్తు పెట్టుకోవడం కష్టమే. కానీ ఇంటర్నెట్ లో ఏవైనా ప్రశ్నలు, సమాధానాలు వైరల్ గా మారినప్పుడు.. అరే దీన్ని చిన్నప్పుడే చదువుకున్నాం కదా గుర్తు రావడం లేదే అంటూ ఆలోచిస్తుంటాం. అయితే అలాంటి ప్రశ్న ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి అదేంటి అనుకుంటున్నారా?

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగడం కామన్. భూమి, సూర్యచంద్రుల కక్షలు ఇప్పటికీ అద్భుతంగానే అనిపిస్తాయి. ఇక ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. వీటి గురించి తెలుసుకోవడానికి ప్రజలు కూడా అదే తరహా ఆసక్తి చూపిస్తుంటారు. భూమి చుట్టుకొలత, ఆకాశం, భూమి మధ్య దూరం.. సముద్ర మట్టం, ఎత్తైన పర్వత శ్రేణులు వంటి అనేక భౌగోళిక అద్యయనాల గురించి వింటాం కూడా. ఇక వీటికి సంబంధించిన ప్రశ్నలే ప్రజలలో ఆసక్తి రేకెత్తిస్తుంటాయి.

భారతదేశంలో ఏ రాష్ట్రంలో సూర్యుడు ముందుగా ఉదయిస్తాడో మీకు తెలుసా? ఈ ప్రశ్ననే ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే దీనికి సమాధానం చాలా మందికి తెలియదట. కానీ సూర్యుడు మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్ లో ముందుగా ఉదయిస్తాడు. అంజావు జిల్లాలోని డాంగ్ అనే ఊరిలో సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు. ఈ పట్టణాన్ని జపాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారట. డాంగ్ అరుణాచల్ ప్రదేశ్ లోని అంజోలో సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో నది, పర్వతాలతో కూడిన గ్రామం.

ఈ గ్రామం చైనా, మయన్మార్ మధ్య ఉంటుంది. బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన లోహిత్ సంగమం దీని అందాన్ని మరింత పెంచుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ డాంగ్ గ్రామంలోనే సూర్యుడు గంట ముందే ఉదయిస్తాడు. అంతేకాదు గంట ముందుగానే అస్తమిస్తాడు కూడా. అందుకే ఈ ప్రాంతం పర్యాటకులలో ప్రసిద్ది చెందింది.