https://oktelugu.com/

Gauri Shankar Temple: పెళ్లి జరగడం లేదా? అప్పులతో బాధ పడుతున్నారా? అయితే ఈ గుడికి వెళ్లండి

తూర్పు భాగంలో సూర్యుడు, ఆగ్నేయంలో అయ్యప్ప స్వామి, దక్షిణ భాగంలో వీరభద్రుడు, కాలభైరవుడు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇక నైరుతి భాగంలో బ్రహ్మదేవుడు కొలువై ఉన్నాడు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 5, 2024 / 10:05 AM IST

    Gauri Shankar Temple

    Follow us on

    Gauri Shankar Temple: కొన్ని గ్రామాల్లో దేవాలయాలు చాలా ప్రసిద్ది చెంది ఉంటాయి. కానీ వీటి గురించి కొందరికి మాత్రమే తెలుస్తుంటుంది. అయితే ఇప్పుడు అలాంటి ఒక ఆలయం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆలయానికి వెళ్తే కాశీకి వెళ్తే వచ్చేంత పుణ్యం వస్తుంది అంటారు భక్తులు. ఈ ప్రాచీన ఆలయం కరీంనగర్ లో ఉంది. ఇక ఈ దేవాలయం పేరు గౌరీ శంకర్ దేవాలయం. దీన్ని 1200 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించారని అంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల కోరికలు తీరుస్తూ దక్షిణ కాశీగా కొలువుదీరాడు ఆ దేవదేవుడు.

    తూర్పు భాగంలో సూర్యుడు, ఆగ్నేయంలో అయ్యప్ప స్వామి, దక్షిణ భాగంలో వీరభద్రుడు, కాలభైరవుడు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇక నైరుతి భాగంలో బ్రహ్మదేవుడు కొలువై ఉన్నాడు. పశ్చిమాన సరస్వతి దేవీ అమ్మవార్లు ఉండడం విశిష్టత. ఇక్కడికి పెళ్లి కానీ యువతి, యువకులు చక్కెర పొడి తో కన్యక పశుపతి, వర పశుపతి పూజలు చేస్తే వారికి తొందరలోనే వివాహం జరుగుతుంది అని నమ్ముతారట.

    రుణగ్రస్తుల నుంచి విముక్తి కలగాలంటే కుబేర పశుపతి అభిషేకం చేస్తే మంచి జరుగుతుందట. ఆయురారోగ్యాలతో ఉండాలంటే శివునికి అభిషేకం చేసిన నీళ్లతో స్నానం చేయాలని నమ్ముతారు భక్తులు. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి అత్యంత అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే శివరాత్రి రోజు శివుడికి శివ కళ్యాణం, అలాగే రోజు జరిగే కైకర్యాలు అత్యంత వైభవంగా జరుగుతాయట. ప్రతి సోమవారం ఇక్కడ వైభవంగా అభిషేకాలు జరుగుతాయట.

    కాశీకి వెళ్తే వచ్చే పుణ్యం ఇక్కడ గౌరీ శంకర్లను దర్శించుకుంటే వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివాలయాన్ని పాత శివాలయం అంటారు. మహాక్షేత్రంగా విరజిల్లుతున్న ఈ శివాలయాన్ని దర్శించుకుంటే భక్త కామధేను కల్పవృక్షము ఈశ్వరుని సేవించి తరించినట్లు అవుతుందని నమ్ముతారు. ఇక శివరాత్రి పర్వదినం అభిషేకం, కళ్యాణం, జాగరణ బిల్వాష్టకం ఉంటుంది.