ABN RK  – Virat Kohli : ఇదెక్కడి ఎడిటింగ్? దెబ్బకు ఆర్కే షాక్ లోకి వెళ్లడం ఖాయం!

అయితే ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే గతంలో వేమూరి రాధాకృష్ణ ఎంఎస్కే ప్రసాద్ ను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగిన ప్రశ్నలను.. విరాట్ కోహ్లీ ఆమధ్య ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకూ సమాధానాలను ఎడిట్ చేశారు. దీనిని ఒక ప్రోమో లాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Written By: Bhaskar, Updated On : July 23, 2023 5:01 pm
Follow us on

ABN RK  – Virat Kohli : తెలుగునాట టెంపర్ మెంట్ ఎక్కువగా ఉన్న జర్నలిస్టు ఎవరూ అని అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు వేమూరి రాధాకృష్ణ. అయితే ఆ వార్త లక్ష్మి బాంబులాగా పేలుతుంది. లేకుంటే సుతిలి బాంబులాగా తుప్పు మంటుంది. కానీ చర్చల్లో లేకుండా మాత్రం ఉండదు. చంద్రబాబు విషయంలో పోతురాజు లాగా పసుపు రంగు పూసుకుని వేషం వేసినప్పటికీ.. మిగతా విషయాల్లో మాత్రం రాధాకృష్ణను మెచ్చుకోకుండా ఉండలేం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ తప్పిదాలను కాస్తో కూస్తో వెలుగులోకి తెస్తున్న ఘనత ఆంధ్రజ్యోతి పత్రికకే దక్కుతుంది.. ఇందులో ఎటువంటి అనుమానం లేదు.. రాధాకృష్ణ కేవలం తన కొత్త పలుకు వ్యాసాలకు మాత్రమే పరిమితం కారు. ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం ద్వారా ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు. మొదటి సీజన్ పూర్తయింది. రెండవ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. పొలిటికల్ మాత్రమే కాకుండా సమాజంలో పేరుపొందిన వ్యక్తులను కూడా ఆయన ఇంటర్వ్యూ చేస్తారు. తాజాగా ఆయన విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ చేశారు. అదేంటి వేమూరి రాధాకృష్ణ విరాట్ కోహ్లీ ఎప్పుడు ఇంటర్వ్యూ చేశాడు? విరాట్ కోహ్లీ వేమూరి రాధాకృష్ణ వద్దకు ఎప్పుడొచ్చాడు? ఇదే కదా మీ అనుమానం?
సాధారణంగా పెద్ద పెద్ద క్రికెటర్లు పేరుపొందిన స్టోర్స్ చానల్స్ కు మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తారు.. అదే మహేంద్రసింగ్ ధోని లాంటి వారైతే స్థానిక మీడియాతో కూడా మాట్లాడుతారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎవరికైనా హిప్పోక్రసి ఉంటుంది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అతీతుడేమీ కాదు. అయితే ఆయన వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ ఎప్పుడొచ్చారు అనేదే ఇక్కడ డౌట్? ఎందుకంటే సోషల్ మీడియాలో వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేస్తుండగా విరాట్ కోహ్లీ సమాధానాలు చెబుతున్నట్టు ఓ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతున్నది. ఈ ఇంటర్వ్యూలో వేమూరి రాధాకృష్ణ విరాట్ కోహ్లీని అతడి ఫామ్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగడం, వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం.. విరాట్ కోహ్లీ కూడా వాటికి అనుగుణంగా సమాధానం చెప్పడం విశేషం.
అయితే ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే గతంలో వేమూరి రాధాకృష్ణ ఎంఎస్కే ప్రసాద్ ను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగిన ప్రశ్నలను.. విరాట్ కోహ్లీ ఆమధ్య ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకూ సమాధానాలను ఎడిట్ చేశారు. దీనిని ఒక ప్రోమో లాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూస్తుంటే ఇది నిజమైన ఇంటర్వ్యూ అనిపించేలాగా ఉంది. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఇది ఎడిట్ వీడియో అని గుర్తించడం కష్టం. అంతలా అనుసంధానించారు మరి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన కొంతమంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. రాధాకృష్ణ ఇంటర్వ్యూకి విరాట్ కోహ్లీ ఎప్పుడు వెళ్లారు? క్రీడాకారులను వేమూరి రాధాకృష్ణ భలేగా ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.