https://oktelugu.com/

Dimple Hayati : దిస్ ఈజ్ టూ మచ్… ఖిలాడి హీరోయిన్ డింపుల్ హయాతి బోల్ లుక్ వైరల్!

డింపుల్ హయాతి సోషల్ మీడియాలో హద్దులు దాటేస్తుంది. డింపుల్ హయాతి బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

Written By:
  • Shiva
  • , Updated On : July 23, 2023 / 04:44 PM IST
    Follow us on

    Dimple Hayati : హైదరాబాద్ భామ డింపుల్ హయాతి పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు దాటిపోయింది. అయినా ఆమెకు బ్రేక్ రాలేదు. చక్కని రూపం ఉన్నా సక్సెస్ దక్కకపోవడంతో వెనుకబడిపోయింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన డింపుల్ హయాతి గల్ఫ్ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ప్రభుదేవా-తమన్నా జంటగా నటించిన అభినేత్రి 2లో కీలక రోల్ చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ మూవీలో స్పెషల్ సాంగ్ ఆఫర్ చేశాడు. ‘సూపర్ హిట్టు’ సాంగ్ లో డింపుల్ హయాతి ఆకట్టుకుంది. 

     
    డింపుల్ హయాతి కెరీర్లో ఖిలాడి బెస్ట్ ఆఫర్. స్టార్ హీరో రవితేజ సరసన జతకట్టే ఛాన్స్ దక్కింది. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఖిలాడి అంచనాలు అందుకోలేదు. నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఖిలాడి మూవీపై డింపుల్ చాలా ఆశలే పెట్టుకుంది. ఈ మూవీ విజయం సాధించి ఉంటే… డింపుల్ కెరీర్ కి చాలా ప్లస్ అయ్యేది. దర్శకుడు రమేష్ వర్మ-రవితేజ మధ్య విభేదాలు తలెత్తాయి. సినిమా ఫెయిల్యూర్ కి ఈ గొడవలు కూడా కారణమయ్యాయి. 
     
    తాజాగా రామబాణం మూవీతో ప్రేక్షకులను పలకరించింది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ డిజాస్టర్ అయ్యింది. మరోసారి ఆమెకు నిరాశ ఎదురైంది. కెరీర్ లో సతమతమవుతున్న డింపుల్ ని అనుకోని వివాదాలు చుట్టుముడుతున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ ఏసీపీ రాహుల్ హెగ్డే ఆమెపై కేసు పెట్టాడు. పార్కింగ్ లో ఉన్న తన కారును డింపుల్ తన్నారని కేసు ఫైల్ చేశారు. ఈ వివాదం కోర్టులో నడుస్తుంది. కక్షపూరితంగా తనను కేసులో ఇరికించారని ఆమె వాపోయారు. 
     
    ఇటీవల హైదరాబాద్ లో దారుణమైన ట్రాఫిక్ జామ్స్ అంటూ ట్వీట్ చేసి డింపుల్ సంచలనం రేపింది. తనపై కేసు పెట్టిన రాహుల్ హెగ్డేకి తగిలేలా ఈ ట్రాఫిక్ ఏసీపీ ఏం చేస్తున్నాడని ప్రశ్నించింది. మాకు ఇంటికి వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. మాకు పెట్రోల్ ఊరకనే రావడం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తన ట్వీట్లో మంత్రి కేటీఆర్, తెలంగాణ సిఎంఓని ట్యాగ్ చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో అమ్మడు హద్దులు దాటేస్తుంది. డింపుల్ హయాతి బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.