Homeఎంటర్టైన్మెంట్Ram Charan Farmhouse : వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..పూర్తి వివరాలు...

Ram Charan Farmhouse : వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Ram Charan Farmhouse : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏంటి?, వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టడం ఏంటి?, మొన్ననే కదా పెద్ది చిత్రం తో ఏకంగా 400 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టారు, సినిమాల్లో పీక్ రేంజ్ లో ఉన్నారు , పాన్ ఇండియా ని ఏలుతున్నారు, ఇలాంటి సమయం లో ఆయన సినీ రంగాన్ని వదిలి, వ్యవసాయ రంగంలోకి రావడం ఏంటి?, అసలు ఏమి జరుగుతోంది? అని మీకు అనేక అనుమానాలు క్రియేట్ అయ్యుండొచ్చు. అక్కడికే వస్తున్నాం.. అసలు విషయం ఏమిటంటే రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి హైదరాబాద్ పరిసరాల్లోని చేవెళ్ల లో , వీళ్లకు ఉన్నటువంటి 5 ఎకరాల్లో అల్ట్రా లగ్జరీ ఫార్మ్ హౌస్ ని పూర్తి చేశారు. ఇంద్రభవనం లాంటి ఈ ఫార్మ్ హౌస్ ని చూస్తే మీ కళ్ళు జిగేలుమంటాయి. ఫేమస్ డిజైనర్స్ హమీద , అమీర్ వంటి వారు ఈ ఫార్మ్ హౌస్ లోని ఇంటీరియర్ డిజైన్స్ ని చేశారట. త్వరలోనే ఈ ఫార్మ్ హౌస్ లోకి రామ్ చరణ్ , ఉపాసన దంపతులు గృహ ప్రవేశం చేయనున్నారు.

అయితే ఈ ఫార్మ్ హౌస్ లో కేవలం వీకెండ్స్ ఎంజాయ్ చేయడం కోసమే కాదు , రామ్ చరణ్ ఈ ఫార్మ్ హౌస్ పరిసరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారట. స్వయంగా ఆయన చేతుల మీదుగానే ఫార్మింగ్ చేస్తారట. చరణ్ మొదటి నుండి తన బాబాయి లాగానే ప్రకృతి ని ప్రేమించే వ్యక్తి అని , తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగానే ఒక ఫార్మ్ హౌస్ ని కట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే డ్రీం తో ఉండేవారని , ఎట్టకేలకు తన డ్రీం ని నెరవేర్చుకోబోతున్నారని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేస్తూ , తన సత్తా చాటుతూ వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టే రామ్ చరణ్ , ఇలా ఒక సామాన్యుడిలా ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యాలని అనుకోవడం చాలా గొప్ప నిర్ణయమే.

ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ ని పూర్తి చేయబోతున్నారట డైరెక్టర్ సుకుమార్. ఈ స్క్రిప్ట్ పూర్తి అయ్యాక ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టి దసరా నుండి షూటింగ్ ని మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ సినిమాలో ఇప్పటికే ఒక పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం నయనతార ని ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ఇప్పటికే సుకుమార్ నిర్ణయం కూడా తీసేసుకున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ రానున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version