Ala Vaikunthapurramuloo Movie House: త్రివిక్రమ్ సినిమాల్లో పెద్దగా ఖర్చు ఉండదు. కానీ విషయం ఉంటుంది. కార్పొరేట్ మనుషులు, అందమైన భవనాలు కనిపిస్తాయి. ఆయన విదేశాలకెక్కడికీ పోకుండా త్రివిక్రమ్ ఇక్కడే సెట్ వేయిస్తారు. అందులోనే సినిమాను కంప్లీట్ చేస్తారు. ఆయన తీసిన ‘అతడు’ నుంచి ఇప్పటి వరకు తీసిన సినిమాలను చూస్తే ఏదో ఒక భవనం మనకు కనిపిస్తుంది. అందులోనే సినిమా మొత్తం నడుస్తుంది. ఆయన మదిలో నుంచి వచ్చిన మ్యూజికల్ అండ్ సెంటిమెంట్ మూవీ ‘అలా వైకుంఠపురం’. ఈ సినిమా రెండు కుటుంబాల మధ్యే నడుస్తుంది. ఇందులో మాస్ హీరో అల్లు అర్జున్ చాలా కూల్ గా కనిపిస్తారు. మిగతా వారు కూడా పెద్దగా హడావుడి చేయకుండా ఉండడంతో సినిమా హాయిగా అనిపిస్తుంది.
అల్లు అర్జున్ తన సొంత ఇంట్లోకి అడుపెడుతున్నారన్న దృశ్యాన్ని చూపించే క్రమంలో ఓ భవనం దర్శనమిస్తుంది. దానిపై ‘వైకుంఠపురం’ అని రాసి ఉంటుంది. కార్పొరేట్ లుక్ వచ్చే ఈ భవనం నిజంగానే ఉందా? అని చాలా మందికి అనుమానం వచ్చింది.అయితే కొందరు దీనిని త్రివిక్రమ్ సెట్ వేయించారని అన్నారు. మరికొందరు ఇది విదేశాల్లో ఉందని చెప్పారు. కానీ వాస్తవానికి ఇది సెట్ కాదు.. విదేశాల్లో లేదు. మన రాష్ట్రంలో.. మన హైదరాబాద్ లోనే ఉంది. మరి ఆ భవనం ఎక్కడుంది? ఇది ఎవరిది? అనేది ఆసక్తిగా మారింది.
‘అలా వైకుంఠపురం’ బక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ ప్రతి ఒక్కరిని అకట్టుకుంది. ఇందులో అల్లు అర్జున్ డైలాగ్స్, డ్యాన్స్ కుర్రాళ్లలో జోష్ పెంచాయి. ఇందులో హీరోయిన్ గా నటించి పూజా హెగ్డేకు సక్సెస్ ప్రారంభం అయిందని చెప్పొచ్చు. ఇలా అన్ని కలగలిపి ఉన్న ఈ మూవీని ఓటీటీలో కూడా చాలా మంది ఆదరించారు. అయితే ఇన్నాళ్లకు అలా వైకుంఠపురం సినిమాలోని బిల్డింగ్ ఎక్కడిది? అన్న చర్చ స్ట్రాట్ అయింది.
అల్లు అర్జున్ ఎంట్రీలోనే ఓ భారీ భవనంలోకి అడుగుపెడుతాడు. దానిపై ‘వైకుంఠపురం’ అని రాసి ఉంటుంది. అయితే ముందే ఇలాంటి భవనం గురించి ఆలోచించిన త్రివిక్రమ్ అందుకోసం సెట్ ను వేయించాలని అనుకున్నాడట. కానీ అల్లు అర్జున్ ప్రత్యేకంగా సెట్ వద్దని చెప్పాడట. రియల్ గా ఉన్న ఇంటిలోనే షూటింగ్ చేయాలని సలహా ఇచ్చాడట. ఇలా వెతుకుతున్న క్రమంలో రామోజీ ఫిల్మిసిటీలో ఈ భవనం కనిపించిందట. ఇంటిముందు ఉన్న ఫర్నీచర్, చెట్లు, విశాలమైన స్థలం చూడగానే అట్రాక్ట్ అయిన త్రివిక్రమ్ ఇందులోనే సినిమా తీయాలని అనుకున్నాడట.
దీనిని అల్లు అర్జున్ కు చూపించగానే అయన కూడా వెంటనే ఒప్పేసుకున్నారట. ఈ ఇల్లు ఎన్టీవీ చైర్మన్ అయిన నరేంద్ర చౌదరి కుమార్తె రచనా చౌదరిది. దీనిని నిర్మించడం కోసం రూ.100 కోట్లు వెచ్చించారట. ఇంద్రభవనం తలపించేలా ఉన్న ఈ ఇంటిని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రామోజీఫిలిం సిటీకి వచ్చిన పర్యాటకులు ఈ భవనాన్ని కూడా చూసేందుకు వస్తున్నారు.