https://oktelugu.com/

Nani Dasara Movie: నాని దసరా మూవీలోని కోల్‌ మైన్స్‌ ఎక్కడివి? వాటి కథేంటో తెలుసా?

Nani Dasara Movie: ధూం ధాం దోస్తాన్‌.. అంటూ సందడి చేస్తున్న ధరణి అలియాస్‌ నాని హీరోగా నటించిన దసరా సినిమా కొద్ది గంటల్లో వెండితెరపై సందడి చేయబోతోంది. కీర్తి సురేష్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్తి డీ గ్లామర్‌ రోల్‌లో ఆమె కన్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రెయిలర్‌ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా నాని అన్నీ […]

Written By:
  • Rocky
  • , Updated On : March 30, 2023 / 09:18 AM IST
    Follow us on

    Nani Dasara Movie

    Nani Dasara Movie: ధూం ధాం దోస్తాన్‌.. అంటూ సందడి చేస్తున్న ధరణి అలియాస్‌ నాని హీరోగా నటించిన దసరా సినిమా కొద్ది గంటల్లో వెండితెరపై సందడి చేయబోతోంది. కీర్తి సురేష్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్తి డీ గ్లామర్‌ రోల్‌లో ఆమె కన్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రెయిలర్‌ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా నాని అన్నీ తానై వ్యవహరించారు. సంతోష్‌ నారాయణ్‌ స్వరపరిచిన పాటలు ఇప్పటికే జనాదరణ పొందాయి.

    అయితే ఈ సినిమా సింగరేణి బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందని ట్రెయిలర్‌లో చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ చెప్పకనే చెప్పాడు. పైగా నానిని పూర్తి రగ్గ్‌డ్‌ వేషధారణలో చూపించాడు. నాని తన గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో కన్పించాడు. మంద తాగుతూ, తెలంగాణ యాసలో మాట్లాడుతూ నాని మాస్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకు దసరా అని పేరు పెట్టిన నేఫథ్యంలో, దాని జస్టిఫై చేసేలా ఈ చిత్రం సాగినట్టు అందులో ఉన్న దృశ్యాలను చూస్తే కన్పిస్తోంది.

    ఇక ఈ సినిమా సింగరేణి నేపథ్యంలోది కావడంతో ఎక్కువ భాగం షూటింగ్‌ కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో చిత్రీకరించారు. వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సింగరేణి ప్రాంతాల్లో అనువైన షూటింగ్‌ లోకేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆండ్రియాల, రామగిరి ప్రాజెక్టు పరిధిలో చిత్రీకరించారు. ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్‌ ఈ ప్రాంత వాస్తవ్యుడే కావడంతో మంచి మంచి లోకేషన్లలో ఈ సినిమా చిత్రీకరించారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే ఈ ఫైట్‌ అండ్రియాల ప్రాంతంలోని కోల్‌ హ్యాండ్లింగ్‌ యూనిట్‌లో చిత్రీకరించారు. ఈ ఫైట్‌ సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలస్తుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

    Nani Dasara Movie

    కేవలం దసరా మాత్రమే కాకుండా చాలా సినిమాలు సింగరేణి ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు జరుపుకున్నాయి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్‌ అండ్రియాల ప్రాంతంలోనే షూటింగ్‌ జరుపుకుంది. ఆ మధ్య విజయ్‌ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం కూడా భద్రాద్రి జిల్లా ఇల్లెందులో షూటింగ్‌ జరుపుకుంది. చిరంజీవి, రామ్‌ చరణ్‌ తేజ్‌ ‘ఆచార్య’ కూడా ఇల్లెందు ఏరియాలో షూటింగ్‌ జరుపుకుంది. ఇక ఆండ్రియాల ప్రాంతంలో సింగరేణికి గెస్ట్‌ హౌస్‌లు ఉండటంతో షూటింగ్‌కు అనువుగా ఉన్నాయని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. విజయ్‌ దేవరకొండ తర్వాతి చిత్రం కోసం అండ్రియాల ప్రాంతంలో పలు లోకేషన్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. చూడపోతే మున్ముందు సింగరేణి ప్రాంతాలు షూటింగ్‌ స్పాట్లుగా వెలుగొందే అవకాశాలు ఎంతో దూరంలో లేవని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.