https://oktelugu.com/

అయ్యొయ్యో.. మరీ ఇంత ఘోరం ఏమిటయ్యా ?

తమిళ్ హీరో విజయ్ అంటే.. సౌత్ లోనే టాప్ హీరో లెక్క. మరి అలాంటి హీరో నుండి భారీ అంచనాలతో ఒక సినిమా రిలీజ్ అయితే.. కలెక్షన్స్ ఎలా ఉండాలి ? అసలు విజయ్ హీరోగా నటించిన ప్లాప్ సినిమాలకే అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. పైగా లాంగ్ గ్యాప్ తరువాత సినిమా వచ్చింది. దాని కోసమైనా అదిరిపోయే కలెక్షన్స్ రావాలి కదా. కానీ, “మాస్టర్” పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. చిన్నాచితకా సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ కూడా […]

Written By:
  • admin
  • , Updated On : January 16, 2021 / 10:16 AM IST
    Follow us on


    తమిళ్ హీరో విజయ్ అంటే.. సౌత్ లోనే టాప్ హీరో లెక్క. మరి అలాంటి హీరో నుండి భారీ అంచనాలతో ఒక సినిమా రిలీజ్ అయితే.. కలెక్షన్స్ ఎలా ఉండాలి ? అసలు విజయ్ హీరోగా నటించిన ప్లాప్ సినిమాలకే అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. పైగా లాంగ్ గ్యాప్ తరువాత సినిమా వచ్చింది. దాని కోసమైనా అదిరిపోయే కలెక్షన్స్ రావాలి కదా. కానీ, “మాస్టర్” పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. చిన్నాచితకా సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ కూడా మాస్టర్ కి రాలేదు అంటే.. ఇది నిజంగా విజయ్ స్టార్ డమ్ కే అవమానం.

    Also Read: వకీల్ సాబ్ కాదు, కిచిడీ సాబ్ !

    తెలుగులో విజయ్ కి భారీ మార్కెట్ లేకపోవచ్చు. కానీ, ఆయన గత సినిమా విజిల్ సూపర్ హిట్. ఆ సినిమా సక్సెస్ కూడా మాస్టర్ సినిమాకి అందలేదు అంటే ఏమనుకోవాలి. ఇక మాస్టర్ సినిమాని హిందీలో కూడా హడావిడిగా రిలీజ్ చేశారు. కానీ సినిమాని హిందీ ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. అక్కడ ఈ సినిమా రెండు రోజులకు కలిపి 35 లక్షలు రూపాయలు కలెక్ట్ చేసింది. ఒక స్టార్ హీరోకి ఇంతకంటే అవమానం ఏముంది ? రిలీజ్ చేయడానికే కోటికి పైగా ఖర్చు పెట్టి ఉంటారు, కానీ కలెక్ట్ చేసింది మాత్రం కేవలం.. ఏంటి కేవలం 35 లక్షలు. అయ్యో మాస్టారూ మరీ ఇంత ఘోరం ఏమిటయ్యా ? అంటూ అక్కడ రిలీజ్ పాపానికి మేకర్స్ తలలు పట్టుకున్నారు.

    Also Read: ‘మాళవిక’ను కష్టాల్లో పడేసిన మాస్టర్ !

    అయినా వాస్తవ పరిస్థితిని చూసుకోవాలిగా. విజయ్ కి మొన్నటివరకు తమిళనాడు, కేరళలో మాత్రమే మార్కెట్ ఉంది, మిగిలిన భాషల్లో విజయ్ కి మార్కెట్ లేదు అనే విషయాన్ని మర్చిపోతే ఎలా ? నిజమే విజయ్ కి గత రెండేళ్లుగా తెలుగునాట కాస్త మార్కెట్ పెరిగింది. కానీ, ఆ మార్కెట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది ? సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే.. అప్పుడు విజయ్ మార్కెట్ పనికొస్తోంది. అంతే కానీ, ప్లాప్ సినిమాని కూడా హిట్ చేసే రేంజ్ విజయ్ కి తమిళంలో తప్ప మిగిలిన భాషల్లో లేదు. ఏది ఏమైనా హిందీ మార్కెట్ లో కూడా పాగా వేసి మరో రజినీకాంత్ కావాలనుకున్నా విజయ్ ప్లాన్ దారుణంగా ప్లాప్ అయింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్