https://oktelugu.com/

Maa TV, Zee Telugu Politics : మాటీవీ, జీ టీవీ టీమ్స్ కలవడం లో మతలబు ఏమిటి ? ఈటీవీకి ఇది షాకే..

Maa TV, Zee Telugu Politics : బుల్లితెరపై కామెడీ షో అంటే మొన్నటి వరకు ఈ-టీవీలో ప్రసారమైన జబర్దస్త్ పేరు మాత్రమే వినిపించేంది. ఇప్పుడు ఆ పేరును మరిచిపోయేలా మిగతా చానెళ్లు విభిన్నమైన కార్యక్రమాలతో పోటీపడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా మా టీవీ, జీ తెలుగు చానెళ్లు ఎంటర్టైన్మెంట్ ప్రొగ్రామ్స్ తో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ లో పనిచేసిన నటులను భారీ ఆఫర్స్ ప్రకటిస్తూ తమ చానెళ్లలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఈ-టీవీ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 29, 2022 / 11:58 AM IST
    Follow us on

    Maa TV, Zee Telugu Politics : బుల్లితెరపై కామెడీ షో అంటే మొన్నటి వరకు ఈ-టీవీలో ప్రసారమైన జబర్దస్త్ పేరు మాత్రమే వినిపించేంది. ఇప్పుడు ఆ పేరును మరిచిపోయేలా మిగతా చానెళ్లు విభిన్నమైన కార్యక్రమాలతో పోటీపడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా మా టీవీ, జీ తెలుగు చానెళ్లు ఎంటర్టైన్మెంట్ ప్రొగ్రామ్స్ తో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ లో పనిచేసిన నటులను భారీ ఆఫర్స్ ప్రకటిస్తూ తమ చానెళ్లలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఈ-టీవీ రేటింగ్ పడగొట్టేందుకు మాటీవీ, జీ తెలుగు కలిసి ఏదో స్కెచ్ గీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు చానెల్స్ లో పనిచేసే టీమ్స్ కలిసిపోయాన్న చర్చ సాగుతోంది.

    వినోదాన్ని పంచడంలో సినిమాల కంటే టీవీ షో లే ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జబర్దస్త్ షో వచ్చిన తరువాత చాలా మంది టీవీ చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కామెడీ ప్రధానంగా సాగే ఈ షో లకు విపరీతమైన క్రేజ్ రావడంతో మిగతా చానెళ్లు సైతం రకరకాల కామెడీ షోలను ప్రసారం చేస్తూ నవ్వులు పూయిస్తున్నాయి. ఒకరి కంటే మరొకరు కొత్త కొత్త ప్రొగ్రామ్స్ చేయిస్తూ తమ చానెల్ రేటింగ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జబర్దస్త్ షో తో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ టీవీని దెబ్బ కొట్టేందుకు స్టార్ మా, జీ తెలుగు కలిసిపోయాయని ప్రచారం సాగుతోంది.

    ఇప్పటివరకు జబర్దస్త్ షో లో కనిపించిన వాళ్లు మరే చానెళ్లలో షో చేయలేదు. కానీ కొందరు నటులు ఇటు జీ తెలుగు, అటు ‘మా ’చానెళ్లలో కనిపిస్తూ షాకిస్తున్నారు. ఈ రెండు చానెళ్లు ఇప్పుడు రకరాల కామెడీ షోల ను ప్రసారం చేస్తున్నాయి. మా టీవీలో కామెడీ స్టార్స్ పాపులారిటీ అయింది. జీ తెలుగులో ‘అదిరింది’ పర్వాలేదనిపిస్తోంది. ఇందులో నటించే వాళ్లు చాలా మంది జబర్దస్త్ నుంచి వచ్చిన వారే. కొందరు కొత్తవాళ్లు ఉన్నారు. జబర్దస్త్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో కొనసాగిన వారితో పాటు కొత్తవారు కలిసిపోయి నవ్వులు పూయిస్తున్నారు. తాజాగా జీతెలుగులో వచ్చిన ఒక ప్రోగ్రాం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘మా’టీవీలో చేసే ‘కామెడీ స్టార్స్’, ‘సరిగమప షో’ కంటెస్టెంట్లను కలిపేసి జీ తెలుగు కామెడీ ప్రోగ్రాం చేయడం చర్చనీయాంశమైంది.

    కొత్త కొత్త ప్రయోగాలు చేయడం ఈటీవీకే సాధ్యం. ముందుగా ఈ చానెల్ స్ట్రాట్ చేసిన తరువాతే మిగతా చానెళ్లు ఫాలో అవుతాయి. టీవీ చానెళ్లలో కూడా కామెడీ షో లు చేయొచ్చని జబర్దస్త్ ద్వారా ఈటీవీ నిరూపించింది. దీంతో మిగతా చానెళ్లు ఆ తరువాత జబర్దస్త్ లాంటి ప్రొగ్రామ్స్ ను ప్రసారం చేస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ అశేష ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఈ మధ్య ఒక్కొక్కరు ఈ ప్రొగ్రామ్ నుంచి బయటకు వెళ్తున్నారు. కొందరు వివిధ రంగాలకు వెళ్లగా..మరికొందరు మాత్రం మాటీవీ, జీ చానెళ్లలోకి జంప్ కొడుతున్నారు. ఇక కొందరైతే జబర్దస్త్ షో ను నిర్వహించిన మల్లెమాలపై ఆరోపణలు చేస్తున్నారు. యాజమాన్యం తమను వేధిస్తుందని అంటున్నారు.

    అలా వేధింపబడ్డ కొందరు ఇతర చానెళ్లలోకి వెళ్లి తమ ప్రతాపం చూపించాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగా ఈ టీవీ కి షాకిచ్చేలా మాటీవీ, జీ తెలుగు టీమ్స్ కలిసిపోయి కొత్త కొత్త షోలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మల్లెమాల గుత్తాధిపత్యాన్ని ఎదురించడంతోపాటు కమెడియన్స్ కు ఉపాధి కల్పించేందుకు.. వారి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు మాటీవీ, జీతెలుగు రెండూ కలిసి వీరిని కలిసి వాడుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జబర్ధస్త్ అంత రేటింగ్ రాకపోవడంతో ‘కామెడీ స్టార్స్’ కార్యక్రమం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర లాంటి వారిని వదులుకుంది. అందుకే కమెడియన్స్ మళ్లీ జబర్ధస్త్ కు తిరిగి వెళ్లకుండా ఉండేందుకే మాటీవీ, జీతెలుగు కలిసి ఈ కమెడియన్స్ ను వాడుకోవాలని స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. అందుకే స్టార్ మాలోని రెండు ప్రోగ్రాంలలో కనిపించే వారితో తాజాగా ‘జీతెలుగు’ ఏకంగా షో రన్ చేయడం సంచలనమైంది. దీన్ని బట్టి మా, జీతెలుగు కలిసి అండర్ స్టాండింగ్ తో ఈటీవీని దెబ్బకొట్టడానికి ఈ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. జబర్దస్త్ ను వీడిన వారందరికీ ఆర్థికంగా భరోసానిచ్చి వారు తిరిగి వెళ్లకుండా ఈ ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈటీవీ షోల రేటింగ్ పడిపోయేలా చేయడానికి కూడా జీతెలుగు, మాటీవీలు ఇలాంటి ముందుడుగు వేసినట్టు ప్రచారం సాగుతోంది.