Sudigali Sudheer Jabardast Re-Entry: జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 2013లో ప్రారంభమైంది. నవ్వుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన కార్యక్రమం ప్రస్తుతం అబాసుపాలవుతోంది. సీనియర్ టీం లీడర్లు ఒక్కొక్కరుగా జబర్దస్త్ ను వీడుతున్నారు. ఫలితంగా కామెడీ రావడం లేదు. గతంలో ఉన్న రేటింగుకు ప్రస్తుత రేటింగ్ కు ఎంతో తేడా ఉంది. గతంలో పది వచ్చేది ఇప్పుడు ఆరేడు కూడా రావడం లేదు. దీనికి ప్రధాన కారణం మల్లెమాల యాజమాన్యమే. టీం లీడర్లు, కంటెస్టెంట్లను పట్టించుకోకపోవడంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
జడ్జి నాగబాబును సైతం లెక్క చేయకపోవడంతో ఆయన కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర, వండర్ వేణు, ధనాధన్ ధన్ రాజ్ లాంటి వారిని సైతం తీసుకెళ్లారు. దీంతో జబర్దస్త్ లో నవ్వుల పూలు పూయడం లేదు. సీనియర్లు లేని షో వెలవెలబోతోంది. ప్రస్తుతం హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ ను వీడుతున్నట్లు తెలియడంతో మల్లెమాల దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సీనియర్లను దూరం చేసుకోకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తోంది. సీనియర్లు వెళ్లిపోతే కామెడీ పండక ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే.
Also Read: Adhir Ranjan Comments: రాష్ట్ర ‘పత్ని’ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ
అందుకే ఇక మీదట జబర్దస్త్ ను వీడి పోకుండా ఉండేందుకు మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గెటప్ శ్రీనుతో శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడి అతడు వెళ్లకుండా చేసినట్లు తెలుస్తోంది. ఇంకా సుడిగాలి సుధీర్ ను కూడా మళ్లీ రప్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మా టీవీలో సుధీర్ కు భారీగా పారితోషికం అందుతుండటంతో అతడు తిరిగి వస్తాడో లేదో తెలియడం లేదు. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి సుధీర్ తో సైతం చర్చలు జరిపి తిరిగి జబర్దస్త్ కు తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
సుధీర్ తో చర్చలు జరిపినా అతడు ఒప్పుకుంటాడా లేదా అనేది అనుమానమే. మా టీవీ వారు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తుండటంతో వారికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. మాతృ సంస్థ కావడంతో మల్లెమాల మీద మమకారం ఉండటం సాధారణమే. దీన్ని ఉపయోగించుకుని శ్యాంప్రసాద్ రెడ్డి సుధీర్ ను తిరిగి జబర్దస్త్ లోకి రప్పించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సుధీర్ వస్తే జబర్దస్త్ మళ్లీ ఓ రేంజ్ కు వెళ్లడం ఖాయమే. కానీ అతడు వస్తాడా? లేదా? అనేది మాత్రం సంశయమే. శ్యాంప్రసాద్ రెడ్డి దౌత్యం ఫలించి సుధీర్ జబర్దస్త్ కు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
Also Read: Maa TV, Zee Telugu Politics : మాటీవీ, జీ టీవీ టీమ్స్ కలవడం లో మతలబు ఏమిటి ? ఈటీవీకి ఇది షాకే..