Mana Shankara Varaprasad Garu Making Video: సరిగ్గా మరో 25 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా కావడమే. దానికి తోడు చిరంజీవి కామెడీ జానర్ లో సినిమా చేసి చాలా ఏళ్ళు అయ్యింది. శంకర్ దాదా MBBS , అందరివాడు తర్వాత ఆయన నుండి ఎంటర్టైన్మెంట్ జానర్ సినిమాలు రాలేదు. రీ ఎంట్రీ తర్వాత కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చాడు కానీ, ఇలా పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా తో కూడిన కామెడీ ఎంటర్టైనర్ మాత్రం చేయలేదు. అందుకే ఈ సినిమా పై ఇంతటి క్రేజ్ ఏర్పడింది.
దానికి తోడు విక్టరీ వెంకటేష్ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించడం తో పాటు, విడుదలైన రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్స్ అవ్వడం తో ఈ సినిమాకు మార్కెట్ లో క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళడానికి కారణం అయ్యాయి. అయితే ఈ సినిమా విడుదలకు సరిగ్గా 25 రోజుల సమయం ఉండడం తో మేకర్స్ నేడు ఒక చిన్న మేకింగ్ వీడియో ని విడుదల చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చేసే అల్లరి ని చూసి, అభిమానులు రౌడీ అల్లుడు సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు. ఆయన కామెడీ టైమింగ్ ని ఈ చిత్రం లో పూర్తి స్థాయిలో బయటకు తీసినట్టు ఈ మేకింగ్ వీడియో ని చూస్తేనే అర్థం అవుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా, ఆయన టీంలో కాథరిన్ తెరిసా, హర్ష వర్ధన్, అభినవ్ కమటం వంటి వాళ్ళు ఉండడాన్ని గమనించొచ్చు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
మరో 25 రోజుల్లో…#ManaShankaraVaraPrasadGaru నవ్వుల సంక్రాంతిని తీసుకొస్తున్నారు #MSG GRAND RELEASE WORLDWIDE IN THEATRES ON 12th JANUARY ❤️
GET READY TO CELEBRATE THE BIGGEST FAMILY ENTERTAINER OF SANKRANTHI 2026 IN CINEMAS #MSGonJAN12th… pic.twitter.com/ExBTdswRrC
— Shine Screens (@Shine_Screens) December 18, 2025