Fake Wedding Trend: అప్పట్లో వచ్చిన ఓ తెలుగు సినిమాలో ఓ సన్నివేశంలో హీరో స్నేహితులు ఓ పెళ్లికి వెళ్తారు. అక్కడ కడుపునిండా తింటారు. ఆ తర్వాత పెళ్లి వాళ్ళతో కలిసిపోయి డ్యాన్సులు వేస్తారు. వేదిక మీద ఉన్న వధూవరులతో ఫోటోలు దిగుతారు. ఆ తర్వాత బయటికి వస్తారు. చూసేందుకు ఈ సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది. ఎందుకంటే ముక్కు ముఖం తెలియని వారి వేడుకకు వెళ్లడం.. అక్కడ భోజనం తినడం.. సందడి చేయడం నవ్వు తెప్పిస్తాయి. కానీ ఇలాంటివి నిజ జీవితంలో జరగవు. ఇక ఇటీవల కాలంలో ఫంక్షన్ హాల్స్ పెరిగిపోయాయి కాబట్టి.. ముక్కు ముఖ తెలియని వారు అందులోకి వచ్చి తిని వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి కల్చర్ ఒక ట్రెండ్ అయిపోయిందట. అయిపోవడం మాత్రమే కాదు ఒక వ్యాపార వస్తువుగా కూడా మారిపోయిందట.
Also Read: అటు ఆర్చర్.. ఇటు బుమ్రా.. లార్డ్స్ లో రాణించే జట్టు ఏదో?
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫేక్ వెడ్డింగ్ ట్రెండు నడుస్తోంది. ఇంతకీ ఇదేంటంటే.. మనలో చాలామందికి పెళ్లిళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. అయితే తెలియని వారి పెళ్లికి వెళ్లి.. అక్కడ సందడి చేసి.. నచ్చిన ఫుడ్ తిని.. వస్తే ఎలా ఉంటుంది.. ఇదే ఆలోచన కొంతమందికి వచ్చింది. రావడమే కాదు అది ఏకంగా వ్యాపారంగా కూడా మారిపోయింది. మన దేశ రాజధాని ఢిల్లీ, నోయిడాలో ఫేక్ వెడ్డింగ్ అనే వ్యాపారానికి దారి తీసేలా చేసింది. ఢిల్లీ, నోయిడా ప్రాంతంలో ప్రస్తుతం ఫేక్ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ఇందులో వధువు ఉండదు. వరుడు కనిపించడు. కాకపోతే పెళ్లి వేడుక మాత్రం ఘనంగా జరుగుతుంది. భోజనంలో అన్ని వెరైటీలు ఉంటాయి. వధువు వరుడు లేకుండానే బరాత్ జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనాలంటే 1499 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ అంతకుమించి ఉండాలి అనుకుంటే 2000 వరకు చెల్లించాలి. మరింత హైఫై సౌకర్యాలు కోరుకుంటే 5000 వరకు చెల్లించాలి. ఇంకా అంతకంటే ఎక్కువ హై ఎండ్ ఉండాలంటే 10,000 వరకు చెల్లించాలి. అయితే చెల్లించిన డబ్బుకు తగ్గట్టుగానే సౌకర్యాలు ఉంటాయి. కాకపోతే ఐదువేల కు మించిన చెల్లించిన వారికి సకల సౌకర్యాలు కల్పిస్తారు. చివరికి దుస్తులు కూడా వారే ఇస్తారు..
నేటి కాలంలో ఒత్తిడి జీవితం ఎక్కువైంది. అందువల్లే చాలామంది ఉపశమనం కోరుకుంటున్నారు. అలాంటివారు కచ్చితంగా ఇలాంటి వేడుకలకు వస్తే చిల్ అవుతారు. నిత్యం ఒత్తిడితో జీవనం సాగించేవారు వివిధ రోగాల బారిన పడుతున్నారు. అలాంటప్పుడు ఇలాంటి వేడుకలు వారికి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఒత్తిడి దూరం చేసి ఆనందాన్ని అందిస్తాయి. ఎలాగూ ఫుడ్ కూడా పెడుతున్నారు. ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. పైగా జనం కూడా ఎక్కువగా ఉంటారు. డాన్సులు వేదికను కూడా సృష్టిస్తున్నారు. అలాంటప్పుడు ఆమాత్రం డబ్బులు ఖర్చు పెట్టడంలో తప్పులేదు కదా. అందువల్లే ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ ప్రస్తుతం దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతంలో జోరుగా సాగుతోంది.
ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్.. కొంతమంది యువకులకు వచ్చిన ఆలోచన. ఇది క్రమక్రమంగా విస్తరించి వ్యాపారంగా మారిపోయింది. దేశంలో విస్తరించడానికి ఇంకా సమయం పట్టే అవకాశం కల్పిస్తోంది. కాకపోతే ఢిల్లీ నగరంలో భిన్న వర్గాలకు చెందిన ప్రజలు ఉంటారు కాబట్టి ఈజీ గానే ఈ ట్రెండుకు కనెక్ట్ అయిపోతున్నారు. ఒక ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించాలంటే తక్కువలో తక్కువ 300 మంది దాకా కావాలి. అయితే ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూపులు.. ఫేస్బుక్ గ్రూపులో ఉండడంతో సులభంగానే 300 మంది జమవుతున్నారట. 300 మంది కాగానే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈవెంట్ కు హాజరయ్యే వారికి పాసులు ఇస్తున్నారు. వారికి ఎటువంటి ఫుడ్ ఇష్టమో ముందే తెలుసుకొని.. వాటిని ప్రిపేర్ చేస్తున్నారు. ఫంక్షన్ హాల్.. డ్రెస్ కోడ్.. ఫుడ్ మెనూ ముందుగానే వాట్సప్ కి పంపిస్తున్నారు. ఆ తర్వాత ఫేక్ వెడ్డింగ్ నడిపిస్తున్నారు.