Life of spouses: పెళ్లి కాకముందు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకుంటారు. కానీ భార్యాభర్తల్లో ఒక్కరి ఆలోచన తేడా ఉన్నా అది ‘నూరేళ్ల మంట’గా మారిపోతుంది. భార్యాభర్తలు అనోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎవరిని చేసుకోవాలన్నది ఇక్కడ అందరినీ తొలుస్తున్న ప్రశ్న. అయితే చేసుకున్నప్పుడే మెచ్చుర్డ్ వారిని పెళ్లి చేసుకుంటే ఈ కష్టాలు ఉండవని యువతీ,యువకులు అనుకుంటారు.

ఈ క్రమంలోనే కొందరు అమ్మాయిలు తమ కంటే చాలా పెద్ద వాళ్లను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేవారు కొందరు ఉంటారు. ఇక తమతో సమాన వయసు ఉన్న వాళ్లను చేసుకోవడానికి కొందరు ఇష్టపడుతారు. నిజానికి దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే ఏజ్ గ్యాప్ అసలు ఎంత ఉండాలన్నది తెలుసుకోవాల్సిందే..

చాలా మంది పెళ్లి చేసుకునే యువతీ యువకులు తమ ఏజ్ గ్యాప్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇద్దరి మధ్య రెండేళ్లు ఉండేలా చూసుకుంటారు. కొందరు కనీసం పదేళ్లు లేకపోతే చేసుకోరు. అమ్మాయిలు కొందరు పెద్ద వాళ్లను, మరికొందరు తమతో సమాన ఏజ్ ఉన్న వాళ్లను ఇష్టపడుతారు.
భార్యాభర్తల మధ్య 5 నుంచి 7 ఏళ్ల గ్యాప్ ఉన్న దంపతుల మధ్య గొడవలు, అపార్థాలు, వాదనలు చాలా తక్కువగా ఉంటాయని అధ్యయనంలో తేలింది. ఇందులో ఎవరో ఒకరు మెచ్చురిటీగా ఆలోచిస్తారు. గొడవలు రాకుండా చూసుకుంటారు. వెంటనే సర్దుకుపోతారట.. వివాహబంధం కుప్పకూలకుండా జాగ్రత్తపడుతారట.. ఈ గ్యాప్ ఉన్న వారు అర్థం చేసుకొని ఆనందంగా గడుపుతారని తేలింది.
10 ఏళ్ల ఏజ్ గ్యాప్ దంపతుల మధ్య ఉంటే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయే అవకాశాలుంటాయట.. వీళ్లు సర్దుకోలేరట..
ఇక 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ తో పెళ్లిళ్లు చేసుకోవడం వేస్ట్ అని.. ఇంత గ్యాప్ తో పెళ్లి చేసుకుంటే అభిప్రాయాలు, అభిరుచులు, సంసారం సరిగా సాగక.. పిల్లలను కనడం భారమై వీరి సంసారం సాగదని తేలింది.
Also Read: Diabetes: ఈ గింజలు తింటే మధుమేహం కు చెక్ పెట్టవచ్చు.. అవేంటంటే?
అయితే ప్రపంచం మారిపోతోంది. పెళ్లికి వయసు అనేది మ్యాటర్ కావడం లేదు. నచ్చిన వారిని నచ్చిన వారు చేసుకుంటున్నారు. పెద్ద వయసు తేడాను గుర్తించడం లేదు.
Also Read: Omicron Variant: ప్రజల్లో ఆందోళన పుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్?

