
Naresh Pavitra Marriage- Ramya Raghupathi: నరేష్-పవిత్ర-రమ్య రఘుపతిల ట్రయాంగిల్ మ్యారేజ్ ఎపిసోడ్ లో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. నరేష్ అన్నంత పని చేశారు. ఆయన పవిత్ర లోకేష్ మెడలో తాళి కట్టాడు. మీ ఆశీర్వాదం కావాలంటూ పెళ్లి వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. నరేష్-పవిత్రల పెళ్లి వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతుంది. 2022 డిసెంబర్ 31న నరేష్ నాలుగో పెళ్లి ప్రకటన చేశారు. నటి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆమెను కిస్ చేస్తున్న ఒక రొమాంటిక్ వీడియో సైతం పెళ్లి ప్రకటనతో పాటు పంచుకున్నారు.
నరేష్ ప్రకటనపై రమ్య రఘుపతి కొంచెం ఆలస్యంగా స్పందించారు. నరేష్ ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. నరేష్ పలువురు మహిళలతో ఎఫైర్స్ నడిపాడని, నీలి చిత్రాలు చూస్తాడని, నన్ను వదిలించుకునేందుకు అక్రమ సంబంధాలు అంటగట్టాడని… ఇలా దారుణ కామెంట్స్ చేశారు. నరేష్ ని ఆమె ఒక కామాంధుడిగా చిత్రీకరించింది. అయినప్పటికీ నరేష్ నాకు కావాలని స్పష్టత ఇచ్చింది. మా అబ్బాయి నాన్న కావాలని అంటున్నాడు. వాడి భవిష్యత్తు కోసం నేను విడాకులు వద్దనుకుంటున్నాను. పవిత్రతో ఆయన వివాహం చెల్లదు. వారి పెళ్లి జరగనీయను అని శబ్దం చేశారు.

రమ్య ఆరోపణలపై నరేష్ స్పందించారు. ఆయన తిరిగి రమ్యపై విమర్శలు గుప్పించారు. ఆమె ఒక తిరుగుబోతు, తాగుబోతు అన్నాడు. నన్ను చంపేందుకు స్కెచ్ వేసింది. నా ఫోన్ ట్యాప్ చేసి ఒక బ్లాక్ మెయిలింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసింది. ఆమెతో విడిపోయి ఐదారేళ్లు అవుతుంది. భార్యాభర్తలు రెండేళ్లు విడివిడిగా ఉంటే… విడాకులు మంజూరైనట్లే, ఎవరి జీవితం వాళ్ళదని కోర్టులే చెప్పాలి. నేను ఏం చేస్తే నీకెందుకు? ఎవరితో జీవిస్తే నీకెందుకు? అని నరేష్ ప్రశ్నించారు.
నరేష్-పవిత్ర లోకేష్ ల వివాహం జరగనీయనని శబధం చేసిన రమ్య రఘుపతి రియాక్షన్ ఏమిటి? నరేష్ నాలుగో పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆమె ఏం చేయనున్నారు? అనే సందిగ్ధత మొదలైంది. ఇవాళ లేదా రేపు రమ్య రఘుపతి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. దీంతో తనకు విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకోవడంపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తంగా నరేష్ పెళ్లిళ్ల ఎపిసోడ్ కీలక దశకు చేరుకుంది.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023