
IPS Sunil Kumar: ఏపీ పోలీస్ శాఖలో చాలామంది సీనియర్ అధికారులు ఉన్నారు. కానీ పీవీ సతీష్ కుమార్ లాగా ఎవరూ ప్రాచుర్యం పొందలేదు. దానికి కారణం ఆయన వివాదాస్పద వ్యవహార శైలి. రాష్ట్రంలో విపక్ష నేతలను టార్గెట్ చేస్తూ వీరవిహారం చేశారు. ముఖ్యంగా టీడీపీ నేతల అర్ధరాత్రి అరెస్ట్ లు, కేసుల నమోదులో సతీష్ కుమార్ వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. అయితే ఆయన ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసమే అంతా చేసినట్టు అర్ధమవుతుంది. అటు ప్రభుత్వం గో హెడ్ అని చేయి తట్టి ప్రోత్సహించింది. ఏదో అత్యున్నత పోస్టు ఆశించిన సతీష్ కుమార్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆయన ద్వారా స్వామి కార్యం.. సకార్యం పూర్తిచేసుకున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆయన ఆశించిన పోస్టు ఇవ్వలేదు.. సరికదా అప్రాధాన్య పోస్టులో నియమించారు.
సాధారణంగా గిట్టని అధికారులను రిజర్వ్ లో పెడతారు. అప్రాధాన్య పోస్టును కేటాయిస్తారు. సునీల్ కుమార్ కు కేటాయించిన పోస్టు కూడా సేమ్ అలానే ఉంది. ఆయనకు ఫైర్ సర్వీసెస్ డీజీగా నియమించారు. ఏదో అనుకుంటే ఏదో అయ్యిందన్న బాధ, ఆవేదన ఆయనది. గతంలో బదిలీ జరిగిన తర్వాత ఆయన అమెరికా వెళ్లారు. డీజీపీగానే తిరిగి వస్తారని ప్రచారం జరిగింది. ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆయనను తప్పించింది కానీ.. ఆయనకు డీజీపీ పోస్టు ఇచ్చే ఉద్దేశంలో ఉందని చెప్పుకున్నారు. దానికి తగ్గట్లుగానే రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించబోతున్నట్లుగా ప్రచారం చేశారు. చివరికి డీజీపీ కాదు కాదు… ప్రాధన్య పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. డిమోషన్ స్థాయిలో ఒక పోస్టు కేటాయించారు.

అయితే సునీల్ కుమార్ విషయంలో ప్రభుత్వం లో వచ్చిన మార్పు హాట్ టాపిక్ గా మారింది. ఆయన్ను తప్పించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది. అయితే డీజీపీ కాకున్నా.. ఆ స్థాయిలో ఒక పోస్టు కేటాయించడమేనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కానీ అప్రాధాన్య పోస్టు ఎందుకు కేటాయించారనేదే ఇప్పుడు ప్రశ్న. కనీసం ఆయన గౌరవానికి తగిన పోస్టు కూడా లేకుండా పోయింది. వైసీపీ పార్టీ కార్యకర్తల ఆయన పనిచేశారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించారు. భయపెట్టారు. అందులో కొందర్ని వైసీపీ రూట్లోకి తెచ్చారు. అటువంటి వ్యక్తి సేవలను గుర్తించుకోకుండా వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం మాత్రం విస్మయపరుస్తోంది.
వైసీపీని నమ్ముకున్న అధికారులు చాలావరకూ ఫెయిల్యూర్ అవుతున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో అత్యున్నత పదవులకు ఎదగాలుకున్న వారికి తొలుత ప్రోత్సహమిస్తున్నారు. వారితో అన్ని పనులు చేయించుకుంటున్నారు. తీరా కోర్టులో, కేంద్రమో తప్పుపడితే అది మేం చేసింది కాదు.. పలానా అధికారేనంటూ బాధ్యులను చేస్తున్నారు. సునీల్ కుమార్ విషయంలో కూడా అదే జరిగింది. జగన్ ను నమ్ముకొని టీడీపీని సర్వనాశనం చేశారు. ఇప్పుడు జగన్ సర్కారు చర్యలు పుణ్యమా అని నిండా మునిగాడు.