
Heroine Roshini: చేసింది తక్కువ చిత్రాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు హీరోయిన్ రోషిణి. చూడగానే నచ్చేసే చక్కని రూపం ఆమె సొంతం. హోమ్లీ ఫేస్ తో ముచ్చటగా ఉండేవారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ తో నటించిన రోషిణి సడన్ గా మాయమయ్యారు. ఆమె పరిశ్రమకు రావడం వెళ్లిపోవడం ఏదో మాయలా ముగిశాయి. వ్యక్తిగత కారణాలతో పాటు పరిశ్రమలో ఇమడలేక రోషిణి సినిమాలు మానేశారని సమాచారం. లెక్కకు మించిన ఆఫర్స్ వచ్చినా చేయనని ఖరాఖండిగా చెప్పేశారట. ప్రాధాన్యత లేని పాత్రల్లో కమర్షియల్ హీరోయిన్ గా నటించడం రోషిణి ఇష్టపడేవారు కాదట.
Also Read: Shakuntalam Release Date: సమ్మర్ కానుకగా శాకుంతలం… కొత్త రిలీజ్ డేట్ ఇదే!
కేవలం రెండేళ్లు పరిశ్రమలో ఉన్న రోషిణి ఆరు చిత్రాల్లో నటించారు. 1997లో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. శిష్యా టైటిల్ తో తెరకెక్కిన తమిళ చిత్రంలో నటించారు. సీనియర్ హీరో కార్తీక్ ప్రధాన పాత్ర చేశారు. దర్శకుడు సురేష్ కృష్ణ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి వంటి టాప్ స్టార్ పక్కన ఛాన్స్ ఇచ్చారు. మాస్టర్ మూవీలో ఆమె చిరంజీవితో జతకట్టారు. అయితే సెకండ్ హీరోయిన్. రోషిణి పాత్ర చనిపోతుంది. మాస్టర్ మూవీలో సాక్షి శివానంద్ మెయిన్ హీరోయిన్.
మాస్టర్ లో చిరంజీవి-రోషిణిల మీద తెరకెక్కిన ‘తిలోత్తమా..’ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ని అలరించే రొమాంటిక్ సాంగ్. నెక్స్ట్ మరో టాప్ స్టార్ బాలయ్యతో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. పవిత్ర ప్రేమ మూవీలో లైలా ఒక హీరోయిన్ కాగా రోషిణి మరొక హీరోయిన్. పవిత్ర ప్రేమ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. శ్రీకాంత్ కి జంటగా శుభలేఖలు టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేశారు. రోషిణి చివరి చిత్రం తుల్లి తిరింత కాలం. ఆ తర్వాత ఆమె నటించలేదు.

యాక్టింగ్ మానేశాక రోషిణి వివాహం చేసుకుని ముంబైలో సెటిల్ అయ్యారు. గృహిణిగా మారి మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం ఒళ్ళు చేసి బొద్దుగా తయారయ్యారు. ఆమెను ఇప్పుడు చూస్తే గుర్తించడం కష్టమే. ఇంటర్నెట్లో కూడా రోషిణి గురించి ఎక్కువ సమాచారం లేదు. ఇక రోషిణి నగ్మా, జ్యోతికల సొంత చెల్లెలు. హీరో సూర్యకు మరదలు అవుతారు. తరచుగా చెన్నై వచ్చి అక్క జ్యోతికను రోషిని కలుస్తూ ఉంటారు. నగ్మా వివాహం చేసుకోలేదు.
Also Read:NTR On Oscar : ఆస్కార్ మిస్… అవమానంతో రగిలిపోతున్న ఎన్టీఆర్!