
Suryakumar Yadav: అతడు మైదానంలోకి వస్తే ఫోర్లకు కొదవ ఉండదు. సిక్సర్ల కు కరువు ఉండదు.. బౌలర్లకు నిద్ర ఉండదు.. టి20లో సూర్య కుమార్ యాదవ్ గురించి చెప్పేటప్పుడు ఇలాంటి ఉపమానాలే వాడతం..కానీ అదే టెస్టులు, వన్డేల విషయానికి వస్తే సూర్య గురించి ఎటువంటి ఉపోద్ఘాతాలు వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాటిల్లో అతడు రాణించలేడు కాబట్టి.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేడు కాబట్టి… ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తోంది అంటే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ విదర్భ స్టేడియంలో మొదటి టెస్ట్ లో సూర్య కుమార్ యాదవ్ 8 పరుగులు చేశారు కాబట్టి… అభిమానుల అంచనాలు అందుకోలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు కాబట్టి…
టి20 ల్లో నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా ఉన్న సూర్య కుమార్…అదే ఫామ్ ను మిగతా ఫార్మాట్లలో కంటిన్యూ చేయలేకపోతున్నాడు.. వన్డేలోనూ అతను రాణించలేకపోతున్నాడు.. దీంతో అతడి ఆట తీరుపై తెగ విమర్శలు వచ్చాయి.. కేవలం టి20 లో మాత్రమే సూర్య రాణిస్తాడని, మిగతా ఫార్మాట్ లలో అతడు ఇన్నింగ్స్ నిర్మించలేడని ఫ్యాన్స్ మండిపడ్డారు.. అంతేకాదు అలాంటి ఆటగాడిని ఆస్ట్రేలియా టెస్ట్ కు ఎంపిక చేయడం పట్ల చాలా విమర్శలే వచ్చాయి.
ఫామ్ లో ఉన్న గిల్ ను కాదని సూర్యకు తొలి టెస్ట్ లో టీం మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది.. అతను మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడిన మొదటి టెస్టులో కోహ్లీ ఔట్ అయిన తర్వాత సూర్య క్రీ జు లోకి వచ్చాడు.. కానీ ఏమాత్రం రాణించలేకపోయాడు.. పంత్ లేని లోటు తీరుస్తాడు అనుకుంటే.. వెంటనే అవుట్ అయ్యి నిరాశ కలిగించాడు.

మొత్తం 20 బంతులు ఎదుర్కొన్న సూర్య కుమార్ యాదవ్… ఒక ఫోర్ సహాయంతో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత లియాన్ బౌలింగ్ లో బంతిని ఏమాత్రం అంచనా వేయలేకపోయాడు. బంతిని స్వీప్ చేయబోయి విఫలమయ్యాడు.. దీంతో ఆ బంతి ఆఫ్ స్టంప్ ను కూల్చేసింది. ఇది చూసిన అభిమానులు టి20 ఆటగాడిని టెస్టుల్లో ఆడిస్తే అలాగే ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరికొందరు అతడి నేచురల్ ఆటను ఆడనిస్తే సూర్య రాణిస్తాడని అంటున్నారు. మరి రెండో ఇన్నింగ్స్ లో అతడు జట్టు అంచనాలను అందుకుంటాడేమో వేచి చూడాల్సి ఉంది.