తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. గత సీజన్ కు భిన్నంగా బిగ్ బాస్ నాలుగో సీజన్ కొనసాగుతోంది. బుల్లితెరపై బిగ్ బాస్ తన నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకునేందుకు ఈసారి చాలా కష్టపడాల్సి వస్తోంది. కరోనా ఎఫెక్ట్ వల్ల ఈసారి బిగ్ బాస్ లో పెద్దగా సెలబ్రెటీలు లేకపోవడం ప్రేక్షకులను కొంత నిరుత్సాహానికి గురిచేసింది. అయినప్పటికీ బిగ్ బాస్ మంచి టీఆర్పీని సాధిస్తూ ముందుకెళుతోంది.
Also Read: పాపం బోయపాటి.. మళ్లీ మొదటికొచ్చింది !
బిగ్ బాస్-4లో కంటెస్టెంట్లను ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ చేస్తుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఎలిమినేషన్స్ పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బిగ్ బాస్-4 కార్యక్రమాన్ని తొలి నుంచి చూసే వారికి ఇట్టే అర్థమవుతుంది. బిగ్ బాస్ లో రియల్ గేమ్ ఆడుతున్న వారిని కాకుండా డ్రామాలు ఆడేవారికి బిగ్ బాస్ ప్రాధాన్యం ఇస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.
బిగ్ బాస్ కు కేవలం షో హైలెట్ అయ్యాలా కంటెంట్ ఇస్తే వాళ్లు సేఫ్ అయినట్టేననే టాక్ విన్పిస్తోంది. కొంతమంది బిగ్ బాస్ పెట్టే టాస్కుల్లో ఎంత కష్టపడిన కూడా వారు నామినేషన్లలో ఉంటున్నారు. బిగ్ బాస్ కొందరిని హైలెట్ చేస్తూ మిగతా వారిని సరిగా ఫోకస్ చేయడం లేదనే తెలుస్తోంది. బిగ్ బాస్ లో గొడవలు పెట్టుకునే వారి వల్లే కావాల్సినంత ఫుటేజ్ వస్తుండటంతో వారికే బిగ్ బాస్ ప్రాధాన్యం ఇస్తున్నాడు.
Also Read: మెగా హీరో సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !
ఇప్పుడున్న కంటెస్టుల్లో అభిజిత్.. మొనాల్ టాస్కుల్లో పెద్దగా ఫార్మమెన్స్ చేయకపోయినా కావాల్సినంత ఫుటేజ్ మాత్రం ఇస్తున్నారు. అభిజిత్.. మొనాల్.. అఖిల్ లవ్ స్టోరీ వల్లే ఇప్పటివరకు మొనాల్ బిగ్ బాస్ లో కొనసాగుతున్నారు. ఆమె ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన ఉన్నప్పటికీ పలుసార్లు బిగ్ బాస్ ఆమెను సేఫ్ చేశాడు. బిగ్ బాస్ లో ఎవరైనా గొడవలు పడకుండా ఉంటారో వాళ్లే ప్రతీసారి ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
దీంతో బిగ్ బాస్ లో కష్టపడేవారు కాకుండా కంటెంట్ ఇచ్చే వాళ్లే కొనసాగుతున్నారు. బిగ్ బాస్ కావాల్సినంత ఫుటేజ్ ఇచ్చేవాళ్లు ఈజీగా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినట్లేననే టాక్ విన్పిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే బిగ్ బాస్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్లు గుర్తించి అందుకనుగుణంగా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో రియల్టీ గేమ్ కాస్తా డ్రామా షోగా మారుతుందనే విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్