https://oktelugu.com/

టాలీవుడ్ హీరోలు.. ప్యాన్ ఇండియా స్టార్లుగా మారుతారా?

పులిని చూసిన నక్క వాతలు పెట్టుకున్న చందంగా కొందరు హీరోలు ప్రవర్తిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ‘బాహుబలి’ సిరీసులతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారడంతోపాటు వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు. Also Read: ‘బిగ్ బాస్’లో సేఫ్ కావాలంటే ఏం చేయాలి? ఈ మూవీ తర్వాత కూడా ప్రభాస్ తన క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ ‘సాహో’తో అలరించాడు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2020 / 03:59 PM IST
    Follow us on

    Tollywood heros

    పులిని చూసిన నక్క వాతలు పెట్టుకున్న చందంగా కొందరు హీరోలు ప్రవర్తిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ‘బాహుబలి’ సిరీసులతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారడంతోపాటు వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు.

    Also Read: ‘బిగ్ బాస్’లో సేఫ్ కావాలంటే ఏం చేయాలి?

    ఈ మూవీ తర్వాత కూడా ప్రభాస్ తన క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ ‘సాహో’తో అలరించాడు. ఈ మూవీ తెలుగులో పెద్దగా ఆడకపోయినా బాలీవుడ్లో మాత్రం సూపర్ హిట్టయింది. దీంతో ప్రభాస్ కటౌట్ కి బాలీవుడ్లోనూ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’తోపాటు వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఓ మూవీ చేస్తున్నాడు

    ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కేంచే ‘ఆదిపురుష్’ ప్రభాస్ రాముడిగా కన్పించనున్నాడు. దీంతో ప్రభాస్ బిజినెస్ వేలకోట్లకు చేరింది. ప్రభాస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాంచరణ్ లు ప్యాన్ ఇండియా స్టార్స్ గా మారే అవకాశం కన్నిస్తోంది. వీరిద్దరు ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజై హిట్టుకొట్టడం ఖాయంగా కన్పిస్తోంది.

    వీరే కాకుండా టాలీవుడ్లోని కొందరు హీరోల సినిమాలకు కూడా యూట్యూబ్లో మంచి వ్యూస్ వస్తున్నాయి. అల్లు అర్జున్.. రవితేజ.. రామ్.. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు హిందీలోనూ డబ్ అవుతూ మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. దీంతో వీరు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.

    Also Read:  పవన్ మూవీకి త్రివిక్రమ్ సహకారం.. పారితోషికం ఎంతంటే?

    అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న ‘పుష’ అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అల్లు అర్జున్ కు తెలుగుతోపాటు కేరళలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ కూడా ప్యాన్ ఇండియా మూవీ చేయాలని ఆశపడుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ‘చత్రపతి’ మూవీని హిందీ రీమేక్ చేసేందుకు సన్నహాలు చేసుకుంటున్నారు.

    ఇదిలా ఉంటే డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్లో వ్యూస్ వచ్చినంత మాత్రాన వీరికోసం ప్రేక్షకుల థియేటర్లకు వస్తారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిలో ఎంతమంది ప్యాన్ ఇండియా స్టార్లుగా రాణిస్తారో వేచిచూడాల్సిందే..!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్