Car Tire Numbers: వాహనం ఏదైనా టైర్లు చాలా ముఖ్యం. టైర్లు బాగా ఉంటేనే ఎంత దూరం వెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకుంటే సుదూర ప్రయాణం చేసేవారు తీవ్రంగా నష్టపోతారు. టైర్లలో గాలి తక్కువగా ఉన్నా.. అవి కొంచెం డ్యామెజీ అయినా వెంటనే అప్రమత్తం కావాలి. లేకుంటే అత్యవసర సమయంలో సమస్యలు ఎదురవుతాయి. ఇక వేసవి కాలంలో టైర్ల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎండ వేడికి టైర్లు ఒత్తిడికి గురవుతాయి. కొందరు టైర్లలో ఎయిర్ ప్రెషర్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇవి చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. అసలు టైర్లో ఎయిర్ ప్రెషర్ ఎంత ఉండాలి? ఎలా మెయింటేన్ చేయాలి? అనేది తెలుసుకుందాం..
ఒక టైర్ లోకి ఎంత ఎయిర్ ఎక్కించాలి? అనేది ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఆ టైర్ పైనే అన్నీ డిటేయిల్స్ ఉంటాయి. టైర్లలో ఎంత ఎయిర్ ఎక్కించాలి? అవి ఎంత బరువును మోస్తాయి? అనేవి కూడా ఉంటాయి. టైర్లలో తక్కువ గాలి ఉన్నప్పుడు వాటిపై వెయిట్ పడి అవి వేడిగా మారుతాయి. దీంతో అది తొందర్లోనే అరిగిపోతాయి. ఇలాంటి సమయంలో వేగంగా వెళ్తే ప్రమాదాలకు గురికావొచ్చు. కారు టైర్లలో గాలి తక్కువగా ఉంటే పట్టు కోల్పోయి యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉంది.
భారతదేశంలో వివిధ రకాల టైర్లు ఉత్పత్తి అవుతాయి. అయితే వీటిలో బ్రాండ్, సాధారణ టైర్లు ఉన్నాయి. బ్రాండ్ టైర్ ను గుర్తించడానికి కొన్ని ప్రత్యేక స్టాంప్స్ ఉంటాయి. ఉదాహరణకు టైరు పై PSIతో కూడిన టైర్లు బ్రాండ్ గా చెప్పుకోవచ్చు. ఒక టైర్ పరిమాణం, వెయిటేజీ అంతా PS తరువాత నమోదై ఉంటాయి. అయితే టైర్ ను ఎప్పుడు తయారు చేశారు? దాని విడ్త్ ఎంత? ఎంత బరువును మోయగలదు? ఎంత స్పీడ్ తో వెళ్లగలదు? అనే వివరాలు ఈ నెంబర్లు తెలుపుతాయి.
వాహనాలపై అవగాహన ఉన్నవారు టైర్లపై ఈ నెంబర్లను ముందుగా చూసుకొని వాటి ఆధారంగా కొనుగోలు చేస్తారు. అవసరాల మేరకు ఈ నెంబర్ల ఆధారంగా ఎలాంటి టైర్లను తీసుకోవాలి? అనేది నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా బ్రాండ్ టైర్లు ఏవి? ఎంతకాలం మన్నికగా ఉంటాయి? అనేవి ఇవి తెలుపుతాయి. అందువల్ల టైర్లు కొనే ముందు ఈ నెంబర్లను చూసుకొని ఆ తరువాత కొనుగోలు చేయాలని ఆటోమోబైల్ రంగానికి చెందిన వారు చెబుతున్నారు.