Memu Famous Movie: రీసెంట్ గా చాయ్ బిస్కెట్ సంస్థ నుండి చిన్న సినిమా గా విడుదలై ఆ తర్వాత మౌత్ టాక్ తో అద్భుతమైన వసూళ్లను దక్కించుకుంటూ ముందుకు దూసుకు పోతున్న చిత్రం ‘మేము ఫేమస్’. సుమంత్ ప్రభాస్ అనే కొత్త హీరో ఈ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఆయన హీరో గా నటించడమే కాకుండా, దర్శకత్వం కూడా వచించాడు. సరదాగా సాగిపోయే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఎక్కడా బోర్ కొట్టకుండా, అన్నీ వర్గాల ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా తీర్చి దిద్దాడు.
అసలు ఈ చిత్రం నటుడిగా కానీ, దర్శకుడిగా కానీ ఆయనకీ మొదటిది అని చెప్తే ఎవ్వరూ నమ్మరు, అంత అద్భుతంగా, అనుభవం ఉన్న వాడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాపై మహేష్ బాబు మరియు రాజమౌళి లాంటి సెలెబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించారంటే ఈ కుర్రాడిలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు సుమంత్ ప్రభాస్. అదేమిటంటే ఈ చిత్రం షూటింగ్ మొదటి వారం రోజులు మొబైల్ ఫోన్ తో చిత్రీకరించారట. ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే సన్నివేశాలు, దోస్తులతో సరదాగా కూర్చొని మందు వేసే సన్నివేశాలు, ఇలాంటివన్నీ ఆయన మొబైల్ లోనే తెరకెక్కించాడట. ఫైనల్ ఔట్పుట్ చూసుకున్న తర్వాత బాగా వచ్చింది అని అనిపించినా తర్వాతే పెద్ద ఎక్విప్మెంట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట.
ఈ సినిమా మొత్తం చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గినట్టుగా అనిపించదు. మొబైల్ ఫోన్ తో తీసిన సన్నివేశాలు కూడా చాలా క్వాలిటీ గా అనిపించాయి. ఇంత తక్కువ రిసోర్స్ తో సుమంత్ ప్రభాస్ ఇంత అద్భుతమైన క్వాలిటీ తో సినిమాని తెరకెక్కించడంటే కుర్రాడిలో మామూలు టాలెంట్ లేదనే చెప్పాలి. భవిష్యత్తులో ఇతగాడు ఏ రేంజ్ కి వేళ్తాడో చూడాలి.