Magha Masam 2025 : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మళ్లీ మోగనున్నాయి. ఎంతో పవిత్రమైన భార్యాభర్తల బంధం జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని మంచి ముహూర్తాలు చూసి పెళ్లి చేస్తారు. ఏడాదిలో ఎప్పుడైతే ముహూర్తాలు ఉంటాయో అప్పుడే పెళ్లి చేస్తారు. అయితే మళ్లీ పెళ్లి బాజాలు రానున్నాయి. అది ఎప్పుడో కాదండోయ్.. జనవరి 31వ తేదీ నుంచి పెళ్లి బాజాలు ప్రారంభం కానున్నాయి. చాలా మంది సంక్రాంతి తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో అయితే వర్షాలు, ఎండ సమస్యలు ఉండవని భావించి ఈ సమయంలోనే పెళ్లి చేసుకుంటారు. అందరూ పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూసే పెళ్లి సమయం వచ్చేసింది. ఈ మాఘమాసంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పెళ్లిళ్లు అవుతుంటాయి. ఈ మాసంలో పెళ్లి చేసుకోవడం వల్ల జీవితాంతం గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారని నమ్ముతారు. దీనికోసమే ఇద్దరి జాతకాలు చూసి.. వాటి ప్రకారం ముహూర్తాలను ఫిక్స్ చేస్తారు. గతేడాది పెళ్లి చేసుకోవడానికి కుదరని వారంతా కూడా ఈ మాఘ మాసంలో వివాహం చేసుకుంటారు. కొందరు కార్తీకం, శ్రావణ మాసంలో వివాహం చేసుకుంటారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం ఈ మాఘ మాసంలోనే వివాహం చేసుకుంటారు. అసలు ఈ మాఘమాసంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ముహుర్తాలు ఉన్నాయో చూద్దాం.
మాఘ మాసం అనేది పెళ్లిళ్లకు మారు పేరు. ఎందుకంటే మిగతా మాసాలతో పోలిస్తే ఈ సమయంలోనే బలమైన ముహుర్తాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ మాసాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారు ఎంతో సంతోషంగా ఉంటారట. ఎలాంటి సమస్యలు లేకుండా నూరేళ్ల పాటు సుఖ సంతోషాలతో ఉంటారని గట్టిగా నమ్ముతారు. అందుకే ఎక్కువగా ఈ మాసంలో వివాహం చేసుకుంటారు. జనవరి 30వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభం కావడంతో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి. జనవరి 31 నుంచి మార్చి 16 వరకు పెళ్లిళ్లకు బలమైన ముహూర్తాలున్నాయని పండితులు అంటున్నారు. ఫిబ్రవరిలో 2, 3, 7, 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25 తేదీల్లో బలమైన ముహుర్తాలు ఉండగా మార్చిలో 1, 2, 6, 7, 12 తేదీలు, ఏప్రిల్‌లో 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీలు, మేలో 1, 5, 6, 8, 15, 17, 18 తేదీలు, జూన్‌లో 1, 2, 4, 7 తేదీల్లో ముహుర్తాలు ఉన్నాయి. ఉగాది తర్వాత కంటే ముందు ఎక్కువగా పెళ్లి ముహుర్తాలు ఉన్నాయి. జూన్ ప్రారంభంలోనే ఆషాడ మాసం రావడంతో పెళ్లికి సరైన ముహుర్తాలు లేవు. ఈ ఏడాది మళ్లీ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మళ్లీ మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో చాలా మంది పెళ్లికి రెడీ అవుతున్నారు. మరి మీరు కూడా ఈ మాసంలోనే వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంటే అసలు ఆలస్యం చేయవద్దు.