Water: గాలి నుంచే నీళ్లు తీస్తున్నారు.. వీళ్లు మాములోల్లు కాదు..

గాలి నుంచి నీటిని తయారు చేసే విధానం మన భారతీయ రైల్వేలో ఇప్పటికే ఉంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోనూ ఇలా తయారు చేసిన నీటిని లీటర్‌కు రూ.5కు అమ్ముతున్నారు.

Written By: Raj Shekar, Updated On : February 11, 2024 4:00 pm
Follow us on

Water: నీరు జీవకోటికి ప్రాణాధారం. జీవకోటికి గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. నీరు లేకుండీ జీవకోటి మనుగడ సాధించలేదు. భూమిపై నీటికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇక వివిధ గ్రహాలపై నీటి ఆనవాళ్లను కూడా మనిషి సోధిస్తున్నాడు. నీరు ఉన్న జోట జీవరాశి మనుగడ సాధిస్తుంది ఈ క్రమంలోనే అంగారక గ్రహం, చంద్రుడితోపాటు ఇతర గ్రహాలపైనా పరిశోధనలు చేస్తున్నారు. అయితే భూమిపై పెరుగుతున్న కాలుష్యంతో నీరు కూడా కలుషితం అవుతోంది. సహజమైన నీరు దొరకడం కష్టంగా మారింది. గాలి నుంచి నీరు తీసే పద్ధతిలో వీళ్లు సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.

గాలి నుంచి నీళ్లు..
భూమిపై ఉన్న నదులు, చెరువులు వంటివి నానాటికి ఎండిపోతున్నాయి. జీవ నదుల్లో తాగేందుకు నీరు పనికి రాకుండా పోతోంది. వాటికితోడు వర్షాలు తగ్గడం ఎండలు పెరగడం, అత్యంత చలి ప్రమాదకర పరిణామాలు. ఈ నేపథ్యంలో నీటి సమస్య తలెత్తుతోంది. ప్రపంచంలో అనేక పల్లెలు, పట్టణాలు నీటి కోసం తపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్‌ ఏంటని ఆలోచించిన ఓ కంపెనీ గాలి నుంచి నీటిని తయారు చేయడం మొదలు పెట్టింది.

గాలి నుంచి నీళ్లు ఇలా..
గాలి నుంచి నీటిని తయారు చేసే విధానం మన భారతీయ రైల్వేలో ఇప్పటికే ఉంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోనూ ఇలా తయారు చేసిన నీటిని లీటర్‌కు రూ.5కు అమ్ముతున్నారు. అయితే రైల్వే తయారు చేస్తున్న నీళ్లు కాస్త ఖరీదైనవి, గుజరాత్, బెంగళూర్‌కు చెందిన సంస్థలు తయారు చేస్తున్నవి తక్కువ ఖర్చుతో కూడినవి.

ఇలా తయారీ..
గాలి నుంచి నీటిని తీయడం ఆశ్చర్యంగానే ఉంటుంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్లాంట్లు రావడం ఖాయం. ఎందుకంటే నీటి నుంచి కరెంట్‌ ఎలా తీస్తారో అలాగే గాలి నుంచి నీటి అణువులను వేరుచేస్తారు. ఇవి మనం తాగవచ్చు. గుజరాత్‌కు చెందిన డైరీ చైర్మన్‌ శంకర్‌ చౌదరి గాలి నుంచి నీటిని తయారు చేశారు. ఇందుకోసం రెండ సోలార్‌ ప్లేట్లు వాడారు. ఎయిర్‌ స్టీమ్‌ టెక్నాలజీతో రోజుకు 120 లీటర్ల స్వచ్ఛమైన నీటిని తీస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఉరు ల్యాబ్స్‌లో కూడా గాలి నుంచి నీటిని తయారు చేస్తున్నారు. గాలిలో ఉండే నీళ్లు 8 నుంచి 10 రోజుల్లో రిఫ్రెష్‌ అవుతుంది. మనం భూమి నుంచి తీసిన నీళ్లు రిఫ్రెస్‌ అవడానికి ఏళ్లు పడుతుంది.

ఎంత వాటర్‌ అయినా తీయొచ్చు..
గాలి నుంచి మనం ఎన్ని నీళ్లైనా తీయవచ్చు. దీంతో పర్యావరణానికి కూడా ఎలాంటి హాని జరుగదు. దీని కోసం రెండు పరికరాలు వాడుతున్నారు. మొదటిది అబ్జార్వర్‌. ఇది గాలి నుంచి నీటని స్వీకరిస్తుంది. రెండోది డిజార్వర్‌. ఇది గాలి నుంచి తీసుకున్న నీటిని వాటర్‌గా మారుస్తుంది. ప్రస్తుతం ఈ నీటిని లీటర్‌కు రూ.5కు విక్రయిస్తున్నారు. దీనిని ఇంకా తగ్గించే అవకాశం ఉంది.