https://oktelugu.com/

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ట్రెండ్ సెట్ చేయనుందా?

బాహుబలి.. సాహో మూవీల తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్ సైతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తూ తన క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ప్రభాస్ మూడునాలుగు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బీజీగా ఉన్నాడు. Also Read: చిరంజీవి కోసం వినాయక్ అంతపని చేశాడా? యూవీ క్రియేషన్స్ లో ‘రాధేశ్యామ్’.. వైజయంతి మూవీస్ బ్యానర్లో ఓ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2020 / 12:34 PM IST
    Follow us on

    బాహుబలి.. సాహో మూవీల తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్ సైతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తూ తన క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ప్రభాస్ మూడునాలుగు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బీజీగా ఉన్నాడు.

    Also Read: చిరంజీవి కోసం వినాయక్ అంతపని చేశాడా?

    యూవీ క్రియేషన్స్ లో ‘రాధేశ్యామ్’.. వైజయంతి మూవీస్ బ్యానర్లో ఓ సైంటిఫిక్ మూవీ.. టీ సీరిస్ నిర్మించనున్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ నటిస్తున్నాడు. వీటిలో ‘రాధేశ్యామ్’ రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించిన సరైన అప్డేట్స్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు.

    ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ టీం ఇటీవల వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రాధేశ్యామ్’ నుంచి ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా ‘రాధేశ్యామ్’ మ్యూజిక్ విషయంలోనూ చిత్రయూనిట్ ఆచితుచి వ్యవహరిస్తోంది. దీంతో ‘రాధేశ్యామ్’ చిత్రానికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను ఎంపిక చేసినట్లు సమాచారం.

    ‘రాధేశ్యామ్’ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిస్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. తెలుగు.. తమిళ.. కన్నడ.. మలయాళ భాషల్లో విడుదలయ్యే ‘రాధేశ్యామ్’ చిత్రానికి ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా.. హిందీ వర్షన్ కోసం మరొక మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేయనుంది. ఉత్తరాది వారి కోసం ఒక మ్యూజిక్ డైరెక్టర్.. దక్షిణాది కోసం మరొక మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి పని చేయబోతున్నారు.

    Also Read: జబర్దస్త్ సుధీర్ కు కరోనా అంటూ వార్తలు.. టెన్షన్ లో ఫ్యాన్స్..?

    ‘రాధేశ్యామ్’ టీం కొత్త తరహా ఎక్సపర్మెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గతంలో సాహో మ్యూజిక్ విషయంలో సరైన అవుట్ రాకపోవడంతో ‘రాధేశ్యామ్’ విషయంలో యూవీ క్రియేషన్స్ ఇలా చేస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా ప్రభాస్ మూవీ మ్యూజిక్ విషయంలో ట్రెండ్ సెట్టర్ గా మారనుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.