https://oktelugu.com/

‘రాధేశ్యామ్’ సర్ ప్రైజ్ వచ్చేసింది.. ప్రభాస్ సీడీపీ వైరల్..

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రాధేశ్యామ్’ సర్ ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 పురస్కరించుకొని ‘రాధేశ్యామ్’ సినిమాలోని ఆయన లుక్ ను తెలియజేసేలా సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ అనే పాత్రలో కనిపించనున్నారు. వింటేజ్ ప్రేమ కథా చిత్రంగా ‘రాధేశ్యామ్’ వస్తోంది. ఒక పాత కారుపై ప్రభాస్ ఠీవీగా కిందకు చూస్తున్న లుక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2020 / 12:22 PM IST
    Follow us on

    ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రాధేశ్యామ్’ సర్ ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 పురస్కరించుకొని ‘రాధేశ్యామ్’ సినిమాలోని ఆయన లుక్ ను తెలియజేసేలా సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ అనే పాత్రలో కనిపించనున్నారు. వింటేజ్ ప్రేమ కథా చిత్రంగా ‘రాధేశ్యామ్’ వస్తోంది. ఒక పాత కారుపై ప్రభాస్ ఠీవీగా కిందకు చూస్తున్న లుక్ అదిరిపోయేలా ఉంది.

    Also Read: చిరంజీవి కోసం వినాయక్ అంతపని చేశాడా?

    ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో# హ్యాష్ ట్యాగులతో బర్త్ డే విషెస్ చెప్పేవారు. అయితే ప్రస్తుతం మాత్రం సీడీపీ(కామన్ డిస్ ప్లే పిక్చర్)లతో అభిమానులు హోరెత్తిస్తున్నారు. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్, పవన్ కల్యాన్ సీడీపీలను అభిమానులు ట్రెండింగులోకి తీసుకొచ్చారు.

    ఇక మరో రెండ్రోజుల్లో ప్రభాస్ బర్త్ డే ఉండటంతో ఇప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ప్రభాస్ మాస్ లుక్కులో కన్పిస్తున్న సీడీపీ ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట్లో రిలీజ్ చేశారు. ‘బాహుబలి’ క్రేజ్ ను తలపించేలా ఉన్న ప్రభాస్ సీడీపీ ప్రస్తుతం ట్వీటర్లో ట్రెండింగులోకి తీసుకెళుతోంది.

    Also Read: జబర్దస్త్ సుధీర్ కు కరోనా అంటూ వార్తలు.. టెన్షన్ లో ఫ్యాన్స్..?

    డార్లింగ్ ఫ్యాన్స్ జోష్ చేస్తుంటే ట్వీటర్లో ప్రభాస్ సీడీపీ ఇప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాయడమే ఖాయమనే టాక్ విన్పిస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి సరికొత్త అప్డేట్స్ రానున్నాయి. దీంతో ఆరోజంతా ప్రభాస్ పేరు ట్రెండింగులోకి ఉండనుంది. అయితే రెండ్రోజుల ముందుగానే ప్రభాస్ పేరును సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా అభిమానులు చేస్తుండటం గమనార్హం.