https://oktelugu.com/

వివేకా హత్య కేసు: బండారం బయటపడుతోందా?

గత ఎన్నికలకు ముందు హత్యకు గురైన వైఎస్‌ జగన్‌ బాబాయి వివేకా కేసు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ కేసు ఎంక్వైరీ చేస్తున్న సీబీఐ టీంలోని మెంబర్స్‌కు కరోనా సోకడంతో ఆలస్యం జరిగింది. తాజాగా మరో టీమ్‌ను ఏర్పాటు చేయడంతో కేసులో పురోగతి ఉండనుందని తెలుస్తోంది. అయితే.. ఈ కేసు మలుపులు తిరగబోతున్నట్లుగా తెలుస్తోంది. Also Read: అలా అయ్యాడో లేదో.. అచ్చెన్న మొదలెట్టాడు! వివేకాను ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? ఎవరు చంపించారు..? అందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2020 1:00 pm
    Follow us on

    గత ఎన్నికలకు ముందు హత్యకు గురైన వైఎస్‌ జగన్‌ బాబాయి వివేకా కేసు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ కేసు ఎంక్వైరీ చేస్తున్న సీబీఐ టీంలోని మెంబర్స్‌కు కరోనా సోకడంతో ఆలస్యం జరిగింది. తాజాగా మరో టీమ్‌ను ఏర్పాటు చేయడంతో కేసులో పురోగతి ఉండనుందని తెలుస్తోంది. అయితే.. ఈ కేసు మలుపులు తిరగబోతున్నట్లుగా తెలుస్తోంది.

    Also Read: అలా అయ్యాడో లేదో.. అచ్చెన్న మొదలెట్టాడు!

    వివేకాను ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? ఎవరు చంపించారు..? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం దొరకబోతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం.. కొత్త బృందం రంగంలోకి దిగనుండటంతో కేసు డొంక కదలనున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటివరకు సాధారణ వ్యక్తులను ప్రశ్నిస్తూ సాగగా.. ఇకపై కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రముఖులను కూడా ఆరా తీసేందుకు సీబీఐ ఆఫీసర్లు రంగం సిద్ధం చేశారట.

    మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో చోటుచేసుకున్న కీలక పరిణామంపై అందరి దృష్టి పడింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో ఎలాంటి సంచలనాలు వెలుగు చూస్తాయోనన్న చర్చ మొదలైంది. దర్యాప్తు బాధ్యత ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగం 3వ బ్రాంచికి అప్పగించి.. దర్యాప్తు అధికారిగా డీఎస్పీ దీపక్‌గౌర్‌ను నియమించారు. ఐపీసీ 302 హత్యానేరం సెక్షన్‌ కింద కేసు సీబీఐ రీ -రిజిస్ట్రేషన్‌ చేసింది. ఇందులో భాగంగా త్వరలో ఏపీకి కొత్త బృందం రానుంది. తొలుత వివేకా మృతిని సీఆర్పీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేయగా సీబీఐ మార్పులు చేసింది. త్వరలోనే ఈ స్పెషల్ టీమ్‌ లోతుగా దర్యాప్తు ప్రారంభించనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖుల బండారం బయటపడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

    Also Read: జగన్‌కు చంద్రబాబు ఫోబియా!

    త్వరలోనే కొత్త సీబీఐ బృందం రంగంలోకి దిగుతుండడంతో పలువురు నేతల్లో వణుకు మొదలైనట్లు కనిపిస్తోంది. విచారణ ఏ మలుపు తిరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. అప్పట్లో సిట్ బృందం వైఎస్ కుటుంబంలో కీలక వ్యక్తులను విచారించింది. కొత్త సీబీఐ బృందం అధికారులు కూడా మళ్లీ వారిని విచారించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మొత్తంగా ఇన్నాళ్లు సస్పెన్స్‌ థ్రిల్లర్‌‌ను తలపించిన ఈ కేసు మరికొద్ది రోజుల్లోనే కొలిక్కి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.