Walthair Veeraiah : వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము లేపేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’

Walthair Veeraiah : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..ఆచార్య – గాడ్ ఫాదర్ వంటి వరుస పరాజయాల తర్వాత చిరంజీవి నుండి వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లను సాధించి అభిమానుల ఆకలిని తీర్చింది. తమ అభిమాన హీరో చిరంజీవిని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలని కోరుకున్నారో, డైరెక్టర్ […]

Written By: NARESH, Updated On : January 18, 2023 8:42 pm
Follow us on

Walthair Veeraiah : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..ఆచార్య – గాడ్ ఫాదర్ వంటి వరుస పరాజయాల తర్వాత చిరంజీవి నుండి వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లను సాధించి అభిమానుల ఆకలిని తీర్చింది.

తమ అభిమాన హీరో చిరంజీవిని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలని కోరుకున్నారో, డైరెక్టర్ బాబీ అలాగే చూపించి తాను ఎంత పెద్ద మెగాస్టార్ ఫ్యాన్ అనేది నిరూపించుకున్నాడు.. కామెడీ , సెటిమెంట్, డ్యాన్స్ మరియు యాక్షన్ ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ కి సంబంధించి ఏది కూడా మిస్ చెయ్యకుండా తెరకెక్కించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి విజేతగా నిలిచింది.. సంక్రాంతి సెలవులు అయిపోయాయి కదా, ఇక ఈ సినిమా వసూళ్లు తగ్గిపోతాయని ట్రేడ్ అంచనా వేసింది.

కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ పొందిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం పండుగ తర్వాత కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది..నిన్న వర్కింగ్ డే రోజు ఈ చిత్రం దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.. ఇది ఆల్ టైం నాన్ రాజమౌళి రికార్డు గా చెప్పుకోవచ్చు.. ఈరోజు కూడా ఈ సినిమా అన్నీ ప్రాంతాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ దూసుకుపోయింది. .ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నీ ప్రాంతాలలో అద్భుతమైన వసూళ్లు రాగా, తెలంగాణలో మాత్రం నూన్ షోస్ కాస్త ఎఫెక్ట్ అయ్యాయి.

ఆ తర్వాత మ్యాట్నీ షోస్ నుండి మళ్ళీ పికప్ అయ్యింది..అలా ఈరోజు కూడా ఈ సినిమాకి 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.. వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన ఏకైక నాన్ రాజమౌళి సినిమా ఇదేనని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..మరి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.