Waltair Veerayya Premiere Show Talk: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతోంది.. ‘సై రా నరసింహ రెడ్డి’ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకి భారీ అంచనాలు ఏర్పడింది దీనికే.. మధ్యలో వచ్చిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ‘గాడ్ ఫాదర్’ చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది కానీ మెగాస్టార్ రేంజ్ సూపర్ హిట్ కాలేకపోయింది..అభిమానులకు మెగాస్టార్ ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ బాకీ ఉన్నాడు.

ఆ బాకీ రేపు తీరబోతుంది విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం..బ్లాక్ బస్టర్ సాంగ్స్ మరియు అదిరిపోయే ట్రైలర్ కట్ తో ఇప్పటికే ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను ఏర్పాటు చేసింది..ఇక ఈ సినిమాకి సబంధించి మీడియా మిత్రులకు ఒక ప్రత్యేకమైన ప్రీమియర్ షో ని ఏర్పాటు చేసారు.. కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ ప్రీమియర్ షో లో పాల్గొన్నారు..మరి వాళ్ళ నుండి వచ్చిన టాక్ ఏంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాం.
మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆడియన్స్ , అభిమానులు కోరుకునేది ఒక కమర్షియల్ సినిమా.. మెగాస్టార్ మార్క్ కామెడీ టైమింగ్ , యాక్షన్, డ్యాన్స్ మరియు ఫైట్స్ ఉంటే జనాలు ఆ చిత్రానికి బ్రహ్మారథం పడుతారు.. వాల్తేరు వీరయ్య చిత్రం సరిగ్గా అలాగే ఉందని ఈ ప్రీమియర్ షో నుండి వస్తున్న టాక్.. శంకర్ దాదా MBBS తర్వాత చిరంజీవి నుండి ఆ రేంజ్ కామెడీ టైమింగ్ ఈ చిత్రంలో ఉందట..స్టోరీ రొటీన్ అయ్యినప్పటికీ కూడా టేకింగ్ విషయంలో డైరెక్టర్ బాబీ కి మెగాస్టార్ అంటే ఎంత పిచ్చి ఉందో ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుందట.

సంక్రాంతికి కావాల్సిన అసలు సిసలు కమర్షియల్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి.. ప్రీమియర్ షో నుండి వచ్చిన టాక్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా వస్తే..సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ తో బాగా రక్తికట్టించాడట డైరెక్టర్..చిరంజీవి మరియు రవితేజ మధ్య సన్నివేశాలకు థియేటర్స్ బ్లాస్ట్ అయిపోవడం పక్కా అంటున్నారు.చూడాలి మరీ సినిమా ఎలా ఉంటుందో..