Natu Natu Song Golden Globe Award: ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వరకు అందరూ రాజమౌళి టీం ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.. నిన్నటి నుంచి ఇవాల్టి దాకా మనం చూసింది ఇది ఒక కోణం. కానీ నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఎలా ఇచ్చారు? దాని చరిత్ర ఏమిటీ? ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం.

గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు అంతర్జాతీయ ఫిలిం సర్కిల్లో ఒక చిన్న అవార్డుగా ఉంది. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (హెచ్ ఎఫ్ పీ ఏ) అని అక్కడి సినిమా వార్తలని రిపోర్టు చేసే జర్నలిస్టులు ఓ సంఘం పెట్టుకున్నారు.. సరే దీని విశ్వసనీయత ఎంత అంటే మా దగ్గర ఆ సమాచారం లేదు.. ఇక వాళ్లే ఈ గ్లోబల్ గ్లోబ్ అవార్డులు ఇస్తుంటారు.. న్యూయార్క్ క్రిటిక్స్ అసోసియేషన్, వాషింగ్టన్ ప్రెస్ అవార్డులు బోలెడు అన్ని ఉన్నాయి.. అన్నింటికంటే ఆస్కార్ నామినేషన్ గొప్పది. దాని ముందు ఇవి చిన్న అవార్డులు
ఇండియా నుంచి ఆస్కార్ బరిలో ఏకంగా 10 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఓపెన్ గా చెప్పేస్తున్నాం… అందులో చెల్లె షో అనే గుజరాతి సినిమా మాత్రమే అఫీషియల్ ఎంట్రీ.. మిగతావన్నీ లాబియింగ్ తో ఆ నామినేషన్ల జాబితాలోకి ఎక్కాయి.. అందులో కాంతారా, ది కశ్మీర్ ఫైల్స్, ఆర్ ఆర్ ఆర్, విక్రాంత్ రోణా, గంగూ భాయి కతియావాడి, మి వసంతరావు, తుజ్యా సాతీ కహీ హై, రాకెట్రీ, ఇరవిన్ నిళల్ కూడా ఉన్నాయి. ఫైనల్ నామినేషన్ లిస్టును ఈనెల 24న ప్రకటిస్తారు.. అప్పటివరకూ ఆర్ ఆర్ ఆర్ టీం ఇష్టం.. ఏమైనా ప్రచారం చేసుకోవచ్చు.

ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విషయానికొస్తే ఆస్కార్ కోసం 9000 మంది, ఎమ్మీస్ అవార్డు కోసం 20, 000, బ్రిటిష్ అకాడమీ అవార్డ్ కోసం 6000 మంది ఓట్లు వేస్తారు.. కానీ ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు సంబంధించి జస్ట్ 105 మంది ఓటు వేస్తే చాలు.. అంటే ఇందులో లాబీయింగ్ కూడా జరుగుతుందని ఆరోపణలున్నాయి.. ఈ సినిమాలన్నీ చూసి, మెరిట్ ఉన్న వాటికే వీళ్ళు గ్లోబల్ గ్లోబ్ అవార్డులు ప్రకటిస్తున్నారు. అయితే అందులో ఆర్ఆర్ఆర్ క్రేజ్ కు వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఆస్కార్ లాంటి అత్యుత్తమ అవార్డు వస్తేనే లెక్కలోకి తీసుకోవాలి.
ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనో, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లోనో ఉద్దండులైన టాలీవుడ్ సినిమా జర్నలిస్టులు సమావేశమై ఎలిఫెంట్ అవార్డుల పేరుతో కమిటీ ప్రకటించింది అనుకోండి… దానికి ఎంత విలువ ఉంటుందో… గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కూడా అంతే విలువ ఉంటుందని అమెరికాలో చెప్పుకుంటారు… ఇక మనది లోకల్ కాబట్టి కొంచెం విలువ ఎక్కువ ఉంటుంది..