spot_img
Homeఎంటర్టైన్మెంట్Vishwambhara First Look: మతిపోగొట్టేలా విశ్వంభర ఫస్ట్ లుక్... సంక్రాంతి బరిలో మెగాస్టార్!

Vishwambhara First Look: మతిపోగొట్టేలా విశ్వంభర ఫస్ట్ లుక్… సంక్రాంతి బరిలో మెగాస్టార్!

Vishwambhara First Look: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే నేడు. 1955 ఆగస్టు 22న జన్మించిన చిరంజీవి 69వ ఏట అడుగుపెడుతున్నారు. చిరంజీవి అభిమానులు సంబరాల్లో ముగినిపోయారు. చిరంజీవి జన్మదినం నేపథ్యంలో ఆయన బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర రీరిలీజ్ చేశారు. థియేటర్స్ లో అభిమానుల సందడి నెలకొంది. ఇంద్రసేనారెడ్డిగా చిరంజీవి మరోసారి మోతమోగిస్తున్నాడు. ఫ్యాన్స్ కి మరో ట్రీట్ ఇచ్చాడు చిరంజీవి. విశ్వంభర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రాన్ని చేస్తున్నాడు చిరంజీవి. ఇది సోషియో ఫాంటసీ మూవీ. పలు లోకాల్లో సంచరించే జగదేకవీరుడిగా చిరంజీవి పాత్ర ఉంటుందట. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాథ్ వంటి యంగ్ బ్యూటీస్ సైతం కీలక రోల్స్ చేస్తున్నారు. విశ్వంభర మూవీ భారీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు.

చిరంజీవి జన్మదినం పురస్కరించుకొని విశ్వంభర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇంటెన్స్ సీరియస్ లుక్ లో చిరంజీవి గూస్ బంప్స్ రేపాడు. ఆయన చేతిలో త్రిశూలం ఉంది. అది ఆకాశంలో మెరుపులు పుట్టిస్తుంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ మైండ్ బ్లాక్ చేస్తుంది. కేవలం పోస్టర్ తోనే విశ్వంభర టీమ్ అంచనాలు పెంచేశారు. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే విశ్వంభర సంక్రాంతి బరిలో నిలుస్తుంది.

విశ్వంభర సంక్రాంతికి విడుదల కానుందని ప్రచారం అవుతుంది. నేడు అధికారికంగా ప్రకటించారు. 2025 జనవరి 10న విశ్వంభర పలు భాషల్లో వరల్డ్ వైడ్ విడుదల కానుంది. విశ్వంభర చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. మొత్తంగా చిరంజీవి ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్ అదిరింది.

Exit mobile version