
KCR- Visakha Steels: విశాఖ స్టీల్ కోసం మోడీ పదార్థాలు లేదా మూలధనం కోసం ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ)ని కేంద్రం జారీ చేసింది. ఇది ఎప్పుడైతే జారీ అయిందో అప్పుడే కేసీఆర్ అండ్ కో అలర్ట్ అయింది. సింగరేణిని రంగంలోకి దించుతున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చింది. అదే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ తనకు అలవాటైన రాజకీయాలకు తెర లేపారు. ఏకంగా ఆసక్తి వ్యక్తీకరణ విషయాన్ని పక్కన పెట్టి సింగరేణి ద్వారా వైజాగ్ స్టీల్ కొంటున్నట్టు, అక్కడి ప్రజల బతుకులు మార్చబోతున్నట్టు తన సొంత పత్రికలో రాసుకొచ్చారు. నిజంగా వైజాగ్ స్టీల్ ను కొనేంత ఆర్థిక దన్ను సింగరేణి వద్ద ఉన్నదా? అంత ఆర్థిక సంపత్తి ఉంటే కార్మికులకు బోనస్ ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద ఎందుకు అప్పులు తీసుకొస్తోంది? ఈ ఈ విషయాన్ని కెసిఆర్ సర్కార్ ఎందుకు దాచిపెడుతోంది? అనేవే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నలు.
వాస్తవానికి గత కొద్దిరోజుల నుంచి విశాఖ ఉక్కు చుట్టూ వింత వింత ప్రచారాలు, విచిత్ర విన్యాసాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మగారాన్ని కేంద్రం అమ్మేయడానికి ప్రయత్నిస్తుంటే.. దానిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి క్యాలరీస్ తో బిడ్ వేయిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అసలు వాస్తవం వేరు, ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియకు, ప్రైవేటీకరణకు సంబంధం లేదు. “ముడి పదార్థాల సరఫరా లేదా వర్కింగ్ క్యాపిటల్ ను సమకూర్చితే దానికి సమానమైన విలువగల స్టీల్ ఇస్తాం. ఆసక్తి ఉన్నవాళ్లు ముందుకు రండి” అని విశాఖ స్టీల్స్ “ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన” జారీ చేసింది. అంతే తప్ప ఇది స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కాదే కాదు.
ఇవీ కారణాలు
విశాఖ ఉక్కుకు సంబంధించి కావేరి పేరుతో ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్_3 ఏడాదిన్నర క్రితం నుంచి మూతపడి ఉంది. ముడి పదార్థాలకు అవసరమైన నిధులు లేకపోవడంతో దానిని మూసి వేశారు. దాని పరిస్థితి మరిత దిజారింది..ఇక మిగిలిన రెండు బ్లాస్ట్ ఫర్నేస్ లు పడిపోయింది కు అవసరమైన ముడి పదార్థాలు కూడా సమీకరించలేని దుస్థితి. ఇక అన్ని దారులు కూడా మూసుకుపోయిన నేపథ్యంలో విశాఖపట్నం యాజమాన్యం కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది. “ఎవరైనా ముడి పదార్థాలు సరఫరా చేస్తే దానికి బదులుగా తయారుచేసిన స్టీల్ ను ఇస్తామంటూ” గత నెలలో ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. కేంద్రం ఏ రకంగానూ సహాయం చేయకపోవడంతో తనకు అవసరమైన వనరులను సొంతంగా సమకూర్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నది.
ఆసక్తి వ్యక్తీకరణలో ఏముందంటే
వైజాగ్ స్టీల్ కర్మాగారానికి వర్కింగ్ క్యాపిటల్ లేదా ముడి పదార్థాలు సరఫరా చేస్తే దానికి బదులుగా స్టీల్ ఇస్తామంటూ గత నెల 27న విశాఖ ఉక్కు యాజమాన్యం ఆసక్తి వ్యక్తికరణ ప్రకటన వెలువరించింది. ఉక్కు, ఉక్కు ఉత్పత్తికి సంబంధించిన కంపెనీలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామంటూ అందులో పేర్కొన్నది. స్టీల్ తయారీ సంస్థలతో అనుబంధం, అనుభవం ఉన్నవారు ఎవరైనా బిడ్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నది. స్టీల్ తయారీకి వాడే ముడి పదార్థాల్లో కోకింగ్ కోల్, బ్లాస్ట్ ఫర్నేస్ కోల్, ఇనుప ఖనిజం ముఖ్యమైనవి. వీటిని సరఫరా చేసి వైజాగ్ స్టీల్ ఉత్పత్తులు తీసుకోవచ్చు. లేదా వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చితే దానికి బదులైన స్టీల్ ఉత్పత్తులను తీసుకోవచ్చు అని వైజాగ్ స్టీల్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇందులో ఏ ధరకు స్టీల్ ఇస్తారు అనేదాన్ని యాజమాన్యం వెల్లడించలేదు. మార్కెట్ ధరకు తక్కువకే ఇస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బుక్కు తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాల రంగంలో ఉన్న కంపెనీలు మాత్రమే ఆసక్తి వ్యక్తీకరణకు ముందుకు రావాలని వైజాగ్ స్టీల్ కంపెనీ తాను ఇచ్చిన ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నది. అంతేకాదు బిడ్ దాఖలుకు ఏప్రిల్ 15 ఆఖరి తేదీగా ప్రకటించింది.
ఇక్కడే అంతా విచిత్రం
ముందుగానే చెప్పినట్టు స్టీల్ తయారీకి ఐరన్ ఓర్, కోకింగ్ కోల్,ఫెర్రో అల్లాయిస్, డోలమైట్, లైమ్ స్టోన్, మాంగనీస్, ఆక్సిజన్ వంటివి కీలకమైన ముడి పదార్థాలు. కెసిఆర్ చెప్తున్నట్టు సింగరేణిలో లభించే బొగ్గు కోకింగ్ కోల్/ బీఎఫ్ కోల్ కానే కాదు. సింగరేణి గనుల్లో లభించేది బాయిలర్ కోల్.. అంటే ఇది కేవలం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో బాయిలర్లలో ఉపయోగిస్తారు. ఒకవేళ సింగరేణి సంస్థ ముడి పదార్థాల సరఫరాకు ఎంపిక అయితే.. సంస్థ సరఫరా చేసే బొగ్గును విశాఖ స్టీల్ ప్లాంట్ లోని థర్మల్ ప్లాంట్ లో ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల నెలకు 50 కోట్ల వరకు ఆదా అవుతుందని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెబుతోంది. మరోవైపు ఇతరత్నం ముడి పదార్థాలను సింగరేణి నేరుగా సరఫరా చేసే పరిస్థితి మాత్రం లేదు. ఆసక్తి ఏకగ్రీకరణ నిబంధన ప్రకారం నేరుగా వర్కింగ్ క్యాపిటల్ కూడా అందించే అవకాశం ఉంది. అయితే దీనికోసం 5000 కోట్లు అవసరం. మరి అంత డబ్బును సింగర్ అండి సర్దుబాటు చేయగలదా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న.

ఇక వైజాగ్ స్టీల్ కి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు వేరువేరుగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గుమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సొంతంగా గనులు లేవని, బయ్యారం గనులు కేటాయించాలని అప్పట్లో కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీగా ఉన్న కెసిఆర్ అప్పుడు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ వనరులు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కి ఎలా ఇస్తారంటూ తేల్చి చెప్పారు. కెసిఆర్ ఇప్పుడు సింగరేణి ద్వారా విశాఖ ఉక్కును కాపాడుతామని ప్రకటనలు చేస్తుండడం విశేషం. అప్పుడు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమని భావించిన కేసీఆర్.. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కి సింగరేణి ద్వారా బిడ్ దాఖలు చేయడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఆయన భారత రాష్ట్ర సమితి ద్వారా ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో.. తన రాజకీయ అవసరాల కోసం సింగరేణి కంపెనీని వాడుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.
ఇక ఈ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తోంది. తక్కువలో తక్కువ 2500 కోట్లు సమకూర్చినా విశాఖ బుక్కు గాడిన పడుతుంది. కానీ ఈ మాత్రం ఇచ్చేందుకు కూడా అటు కేంద్రంగాని, ఇటు రాష్ట్రం గాని చర్యలు తీసుకోవడం లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అని చెబుతున్న జగన్.. కనీసం స్టీల్ ఫ్యాక్టరీ బాగు కోసం ఒక చర్య కూడా తీసుకోవడం లేదు.. కడప ఉక్కు కర్మాగారం కోసం ఇనుప ఖనిజం గనులు ఇవ్వాలని కోరిన జగన్.. విశాఖ ఉక్కు ఘనులు కేటాయించాలని కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదు? అని ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం” ప్రజలను సంఘటితం చేసింది. ఇప్పుడు మాత్రం ఒక రాజకీయ క్షేత్రంగా వైజాగ్ స్టీల్ మారిపోయింది. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా!