
Boycott Pushpa 2: బాలీవుడ్ కి చెమటలు పట్టిస్తుంది బాయ్ కాట్ ట్రెండ్. ఈ సోషల్ మీడియా విప్లవం అనేక చిత్రాలను దారుణంగా దెబ్బతీసింది. పెద్ద పెద్ద చిత్రాలను బాయ్ కాట్ చేయాలంటూ నార్త్ ఆడియన్స్ బాయ్ కాట్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అమీర్ ఖాన్, అక్షయ్, హృతిక్ రోషన్ ఇలా పలువురు బలయ్యారు. షారుక్ ఖాన్ పఠాన్ మూవీ మీద కూడా బాయ్ కాట్ ట్రెండ్ నడిచింది. అయితే ఆయన మాత్రం బయటపడ్డారు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆ చిత్ర సక్సెస్ ని ఆపలేకపోయారు.
ఈ బాయ్ కాట్ ట్యాగ్ కి బలైన తెలుగు హీరో విజయ్ దేవరకొండ. ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ని తప్పుబడుతూ బాలీవుడ్ లో బాయ్ కాట్ లైగర్ అంటూ పెద్ద ఎత్తున వైరల్ చేశారు. ఇది ఆ చిత్ర ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ విషయాన్ని ఓ ముంబై డిస్ట్రిబ్యూటర్ నేరుగా చెప్పాడు. విజయ్ నోరు అదుపులో పెట్టుకొని ఉంటే సినిమాకు ఉన్న హైప్ కారణంగా కనీసం ఓపెనింగ్స్ దక్కేవి. విజయ్ దేవరకొండ కారణంగా పెద్ద మొత్తంలో నష్టపోయానని ఆయన వాపోయారు.

తాజాగా బాయ్ కాట్ సెగ పుష్ప 2 చిత్రాన్ని తాకడం ఆందోళన కలిగిస్తుంది. పుష్ప 2 బ్యాన్ చేయాలి. బాయ్ కాట్ చేయాలి అంటూ నార్త్ ఇండియాలో నెగిటివ్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అందుకు పుష్ప 2 పోస్టర్ ని కారణంగా గా చూపుతున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ప 2 నుండి ఆయన లుక్ ఒకటి విడుదల చేశారు. చీర ధరించి ఉగ్రంగా అమ్మోరు రూపంలో ఉన్న అల్లు అర్జున్ చేతిలో గన్ పట్టుకొని ఉన్నాడు. దీన్ని వారు తప్పుబడుతున్నారు. దేవత రూపం ధరించిన అల్లు అర్జున్ గన్ పట్టుకోవడం ఏమిటీ? ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అంటున్నారు.
అయితే ఈ వాదనను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. గన్ కూడా ఆయుధమే. శత్రు సంహారం కోసం అమ్మోరు ఏ ఆయుధం వాడితే ఏంటీ? అల్లు అర్జున్ చెడ్డవారిని సంహరించే సన్నివేశం కోసం సినిమాలో ఆ గెటప్ వేశారని సమర్థిస్తున్నారు. అల్లు అర్జున్ మీద దీన్ని కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఇక వేర్ ఈజ్ పుష్ప? కాన్సెప్ట్ టీజర్ కి భారీ రెస్పాన్స్ దక్కింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుందని సమాచారం. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా… దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.