
Hyper Aadi: హైపర్ ఆది మంచి టైమింగ్ ఉన్న కమెడియన్. సమకాలీన విషయాల మీద ఆయన వేసే సెటైర్స్ బాగా పేలుతాయి. జబర్దస్త్ వేదికగా హైపర్ ఆది సంచలనాలు చేశాడు. బుల్లితెర స్టార్ గా ఎదిగారు. అయితే ఆయన సెటైర్స్, కామెడీ పంచ్లు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. కొన్ని సామాజిక వర్గాలు, వ్యక్తులు, ప్రభుత్వాలు కూడా హైపర్ ఆది కామెడీ పంచ్లను తప్పుబట్టారు. ఒకటి రెండు సందర్భాల్లో హైపర్ ఆది క్షమాపణలు చెప్పడం జరిగింది. తాజాగా హైపర్ ఆది చేసిన మరో కామెంట్ వివాదాస్పదం అవుతుంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ఆయన ఓ స్కిట్ చేశాడు. భార్యలు భర్తలను పెట్టే హింసను, వేధింపులను వ్యతిరేకించే భర్తగా ఆయన స్కిట్ లో నటించారు. ఈ క్రమంలో భార్యలను ఉద్దేశిస్తూ… సంక్రాంతికి చీర అడుగుతారు. కొనిస్తాము. అదేమైనా కడతారా లేదు. ఎప్పుడూ నైటీ ఒకటి వేసుకుంటారు. పిల్లాడి ముడ్డి కడిగి, ముక్కు చీది దానికి తుడుచుకుంటారు. దాంతో మా దగ్గరికి వస్తారు అన్నాడు.
అంతటితో ఆగకుండా… గవర్నమెంట్ కి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే ప్లాస్టిక్ కాదు. మీరు నైటీలు బ్యాన్ చేయాలి అని అన్నారు. హైపర్ ఆది కామెడీలో భాగంగా చెప్పినప్పటికీ ఈ డైలాగ్ వివాదాస్పదం అవుతుంది. మహిళలు వస్త్రధారణను హైపర్ ఆది తప్పుబట్టారని, అనుచిత కామెంట్స్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైపర్ ఆది కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ తప్పుబడుతూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్లో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా హైపర్ ఆది జబర్దస్త్ మానేశారు. ఒకసారి మానేసి రీఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది మరలా ఆ షోకి దూరమయ్యాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో చాలా మంది కొత్తవారే. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది సందడి చేస్తున్నారు. ఆయన వెండితెర మీద బిజీ అయ్యారు. రచయితగా, నటుడిగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ధమాకా, సార్ చిత్రాల్లో హైపర్ ఆది నటించి మెప్పించారు.