Virat Kohli- Babar Azam: ఆసియా కప్ నిర్వహణకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆగస్టు 27 నుంచి యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) వేదికగా ఆరు జట్లు పాల్గొనే ఆసియా కప్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాయి. జట్లు ఇప్పటికే యూఏఈకికు చేరుకున్నాయి. దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 28న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తమ జట్లు విజయం సాధిస్తుందని దీమాతో రెండు దేశాలకు చెందిన ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, విరాట్ కోహ్లికి మంచి సాన్నిహిత్యం ఉంది. వారిద్దరు దాయాది దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా వారి స్నేహం మాత్రం స్వచ్ఛమైనదే. విరాట్ కోహ్లిపై వస్తున్న విమర్శలకు అప్పట్లో ఆజం స్పందించి త్వరలోనే కోహ్లి ఫామ్ లోకి వస్తాడని ఆశిస్తున్నానని ట్వీట్ చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు.
Also Read: Jagan Delhi Tours: జగన్ తో కేంద్రం ఏం చేస్తోంది? మళ్లీ ఢిల్లీకి వెనుక కథేంటి?
తాజాగా దుబాయ్ వేదికగా ఆసియా కప్ కోసం ఇండియా, పాకిస్తాన్ జట్లు ఆదేశానికి చేరాయి. ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్ లో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్ మైదానంలోకి రాగా.. కోహ్లీ చూసి ఇద్దరూ కలుసుకున్నారు. కోహ్లి, ఆజం పరస్పరం కౌగిలించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆట సంగతి ఎలా ఉన్నా వారి స్నేహం మాత్రం కొనసాగడం అందరిని ఆకట్టుకుంటోంది.
ఇండియా, పాకిస్తాన్ దేశాలు చిరకాల ప్రత్యర్థులైనా ఆటగాళ్లలో మాత్రం అలాంటి ఉద్దేశాలు ఉండకూడదని రెండు దేశాల ఆటగాళ్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గతంలో టీ20 ప్రపంచ కప్ తరువాత కోహ్లి, అజం కలిసి మాట్లాడుకోవడం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటను ఆటగానే చూడాలని దానికి ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించొద్దని సూచిస్తున్నారు. మైదానంలో ఉన్నప్పుడే ఆట బయటకొచ్చిన తరువాత మనలో కూడా మంచి స్నేహభావం ఉంటుందని నిరూపిస్తున్నారు.

టీమిండియా ఆసియా కప్ కోసం సన్నాహాలు చేస్తోంది. బీసీసీఐ ఈ మేరకు ఆటగాళ్లతో ఇప్పటికే యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టింది. ఇప్పటికే ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే దేశాల్లో సిరీస్ లు గెలుచుకున్న టీమిండియా ఇందులో కూడా విజయం సాధించాలని చూస్తోంది. ఇందుకు గాను వ్యూహాలు ఖరారు చేస్తోంది. ఆటగాళ్లలో సమన్వయం సాధించి సమష్టితో విజయాలు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు గాను ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా క్రికెటర్ కోహ్లీ, పాక్ కెప్టెన్ బాబర్ అజాం కలుసుకొని ఒకరినొకరు విష్ చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సుహృద్భావ వాతావరణం చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:AP Govt- New File Jumping System: ఏపీలో ఫైల్స్ కు సింగిల్ విండో క్లీయరెన్స్..అస్మదీయులైతే ఒకే
[…] […]