Homeక్రీడలుInd vs Pak Asia Cup 2022: లాస్ట్ బాల్ కు సిక్స్.. 1986లోనూ పాక్...

Ind vs Pak Asia Cup 2022: లాస్ట్ బాల్ కు సిక్స్.. 1986లోనూ పాక్ చేతిలో భారత్ ఓటమి.. ఈ ఆసియాకప్ లో ఏమవుతుందో?

Ind vs Pak Asia Cup 2022: ప్రపంచకప్ టోర్నీలలో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోలేదన్న రికార్డు గత సంవత్సరం చెరిగిపోయింది. గత ప్రపంచకప్ టీ20లో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో భారత్ దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమి సగటు భారతీయుడిని కలిచివేసింది. ఇప్పుడు మరోసారి ఆసియాకప్ వేదికగా పాకిస్తాన్ తో భారత్ తలపడబోతోంది. దీంతో ఆ వేడి మరోసారి రాజుకుంటోంది. ఈసారి గెలుపుపై విశ్లేషకులు ఎవరి అంచనాలు వారు చెబుతున్నారు.

Ind vs Pak Asia Cup 2022
babar azam, rohit sharma

క్రికెట్ ప్రపంచంలో అన్నింటికంటే ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఏందంటే అది భారతదేశం – పాకిస్తాన్ మధ్య పోటీనే అనడంలో ఎలాంటి సందేహం. చరిత్రలో మనం ఎన్ని మ్యాచ్ లు చూసిన ఈ రెండింటి మధ్య పోటీ అంటే రెండు దేశాలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా కంటే కూడా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లకు డిమాండ్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ ఫీవర్ తగ్గకపోవడానికి రెండు దేశాల మధ్య ఉన్న శతృత్వమే కారణం.

Also Read: Virat Kohli- Babar Azam: దుబాయ్ హీట్ లో గ్రీటింగ్స్ చెప్పుకున్న విరాట్ కోహ్లీ, బాబర్ అజాం.. టీమిండియా సన్నాహాలు షురూ

చివరిసారిగా ఇండియా -పాకిస్తాన్ క్రికెట్ మైదానంలో తలపడినప్పుడు, యూఏఈలో జరిగిన T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. అయితే ఈ రోజు వరకు ప్రపంచకప్ వేదికలపై పాకిస్థాన్‌ మనల్ని ఓడించింది ఈ ఒక్కసారి మాత్రమే అనుకుంటాం. కానీ ఇది ఒక్కటే ఓటమి కాదు. కపిల్ దేవ్, వసీం అక్రమ్‌ తాజా సంభాషణల్లో ఇదివరకు ఒకసారి పాక్ చేతిలో భారత్ ఓడిందన్న విషయం తెలిసింది. చేతన్ శర్మ వేసిన ఆఖరి బంతికి జావేద్ మియాందాద్ సిక్స్ కొట్టి తన జట్టును గెలిపించాడని వాళ్లిద్దరూ పంచుకున్నారు. 1986లో పాకిస్తాన్‌పై భారత్ ఓటమిని గుర్తుచేసుకున్నారు.

Ind vs Pak Asia Cup 2022
Ind vs Pak Asia Cup

ఆ టఫ్ ఫైట్ లో 270 స్కోర్ ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు బాగానే ఆడింది. కానీ తర్వాత మూడు వికెట్లు త్వరగా పడిపోవడంతో ఒత్తిడికి గురైంది. “చివరి ఓవర్‌లో డిఫెండ్ చేయడానికి 12-13 పరుగులు ఉంటే పాకిస్తాన్ గెలుపు దాదాపు అసాధ్యం” అని కపిల్ భావించాడు. “చివరి ఓవర్ ను చేతన్ శర్మకు ఇచ్చాడు. అతడే టీమిండియాను గెలిపిస్తాడని కపిల్ భావించారు. చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా.. చేతన్ లోయార్కర్ వేశాడు. తన శక్తి మేరకు ప్రయత్నించాడు. అది తక్కువ ఫుల్-టాస్‌గా మారింది. మియాందాద్ తన బ్యాక్‌ఫుట్‌ను అలాగే దానిని సిక్స్ కొట్టాడు. పాక్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఆ రాత్రి తామంతా నిద్ర పోలేదని కపిల్ దేవ్ పంచుకున్నాడు. ఆ ఓటమి మొత్తం జట్టు యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని చెప్పుకొచ్చాడు. తరువాతి నాలుగు సంవత్సరాలు ఆ ఓటమి వెంటాడిందని.. ఆ ఓటమిని అధిగమించడం చాలా కష్టమని తెలిపారు.

ఈ క్రమంలోనే మరోసారి ఆసియా కప్ 2022 కు రెడీ అయ్యింది. ఆగస్టు 28న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు ఒకరితో ఒకరు తలపడుతున్నారు. ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.

Also Read:Jagan Delhi Tours: జగన్ తో కేంద్రం ఏం చేస్తోంది? మళ్లీ ఢిల్లీకి వెనుక కథేంటి?

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular