Tractor Converted into Road Roller: మనదేశంలో తక్కువ ఖర్చుతో, తెలివిగా పనులు చక్కబెట్టడంలో మనోళ్లు చాలా టాలెంటెడ్. పైసలు లేకపోయినా, ఉన్నదాంతోనే పనిని ఎలాగో అలా లాగించడంలో మనోళ్లు దిట్ట. ఖరీదైన పనులను తక్కువ ఖర్చులో, అదిరిపోయే ఐడియాలతో పూర్తి చేయడంలో మనోళ్లు ఎప్పుడూ ముందుంటారు. అందుకే అలాంటి వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టగానే వైరల్ అవుతాయి. అలాంటి ఒక అద్భుతమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ట్రాక్టర్ టైర్ పాడైపోతే, ఒక కుర్రాడు ఏకంగా డ్రమ్మును టైర్‌గా ఉపయోగించాడు. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.
కొత్త వాటికి బదులుగా తక్కువ ఖర్చులో పని పూర్తి చేసుకోవడం మన భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య. ఈ జుగాడ్తో కూడిన వీడియోలు నెట్టింట్లో అప్లోడ్ చేయగానే వైరల్‌గా మారుతుంటాయి. అలాంటి ఒక సంచలనం సృష్టించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన ట్రాక్టర్ ముందు టైరుకు బదులుగా ఏకంగా ఒక పెద్ద డ్రమ్మును అమర్చి నడుపుతున్నాడు. ఈ వింత దృశ్యం చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.
India day by day
What America used to say, what are you, today we say, what are you. pic.twitter.com/U5aYmbds0t— Reetesh Pal (@PalsSkit) July 22, 2025
సాధారణంగా ట్రాక్టర్ వంటి భారీ వాహనాలకు చిన్నపాటి సమస్య వచ్చినా, దాన్ని సరిచేయడానికి వేలల్లో ఖర్చవుతుంది. ముఖ్యంగా టైర్లు చాలా ఖరీదైనవి. అయితే, ఈ వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి ట్రాక్టర్ ముందు టైరు పగిలిపోవడంతో డబ్బు ఆదా చేసుకోవడానికి అద్భుతమైన ఐడియా వేశాడు. పగిలిన టైరు స్థానంలో ఒక పెద్ద మెటల్ డ్రమ్మును ఫిట్ చేసి ట్రాక్టర్‌ను నడుపుతున్నాడు. ఈ క్లిప్ చూసిన చాలా మందికి అది ట్రాక్టర్ కంటే రోడ్డు రోలర్ లా కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోను X ప్లాట్‌ఫారమ్‌లో @PalsSkit అనే అకౌంట్ షేర్ చేసింది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ వీడియోను వేల మంది చూశారు. కామెంట్ సెక్షన్లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. చాలా మంది నెటిజన్లు దీనిని చూసి ఆశ్చర్యపోగా, కొందరు మాత్రం దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.