https://oktelugu.com/

Viral : ‘పులిపై పడిన లేడి కథ వింటారా’ పాటను ఈ లేడి కూడా ఫాలో అయినట్లుంది..

పామును తింటున్న జింక వీడియోను ట్వీట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ స్పందిస్తూ.. జింక పామును మింగుతున్న వీడియో వైరల్ అవుతోందని, తాను ఎప్పుడూ ఇటువంటిది చూడలేదని ఆయన పేర్కొన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 12, 2023 / 10:55 PM IST
    Follow us on

    Viral : చీకటి లాంటి పగటి పూట.. కత్తుల్లాంటి పూలతోట.. జరిగిందొక్క వింత వేట.. పులిపై పడిన లేడి కథ వింటారా?’ అంటూ ‘అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ తన అందాల రాక్షసి అయిన హీరోయిన్ పూజా హెగ్డే గురించి అద్భుతంగా పాట పాడాడు. అయితే ఆ పాటలోని పదాల పొందిక చూస్తే ప్రకృతికి విరుద్ధంగా జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కరుడుగట్టిన రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అయిన ఎన్టీఆర్ కొంతమందిని తెగ నరికి అజ్ఞాతంలో తిరుగుతుంటాడు. ఆయన ఫ్యాక్షనిజాన్ని ఆవేశాన్ని, ఆక్రోశాన్ని మొత్తం తగ్గించేసి అరవింద సమేత మార్చేస్తుంది. ఆ పోలికతో ఆ పాటను రాశారు. సహజసిద్ధానికి విరుద్ధంగా జరిగింది కనకనే అది వింతగా మారింది. ఇక్కడ కూడా అంతే.. ఒక సాధు జీవి.. గడ్డి తినే జింక ఒక విషపూరిత పామును కరకరా నమిలి తింటుంటే ఆ వింత చూడగలమా? ఇది కూడా ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్నదే.. అదే ఇక్కడ జరిగింది.

    సాధారణంగా జింక ఆహారంగా గడ్డిని తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఆకులు, అలములు తిని జీవనం సాగిస్తుంటుంది. కానీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న ఒక వీడియోలో కనిపిస్తున్న జింక మాత్రం ఏకంగా పామును ఆహారంగా తీసుకుంటుంది. జింక ఏమిటి..? పామును ఆహారంగా తీసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా..? మీరు చదివింది నిజమే. ఆ వివరాలపై మీరూ లుక్కేయండి.

    ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో తెగ చక్కెర్లు కొడుతోంది. ట్విట్టర్లో ఒక నెటిజన్ పోస్ట్ చేసిన ఒక వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ రీట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఒక జింక పామును తింటూ కనిపించింది. ఏమాత్రం బెరుకు లేకుండా ఆ పామును గడ్డి తిన్నట్లుగానే తింటూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఆ వీడియోను వేలాది మంది వీక్షించడంతోపాటు వందలాదిమంది షేర్ చేస్తున్నారు.

    తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ట్వీట్..

    పామును తింటున్న జింక వీడియోను ట్వీట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ స్పందిస్తూ.. జింక పామును మింగుతున్న వీడియో వైరల్ అవుతోందని, తాను ఎప్పుడూ ఇటువంటిది చూడలేదని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోను రోడ్డుపై నుంచి కారులో వెళ్తున్న వ్యక్తులు తీశారు. నిలబడి ఉన్న జింక పామును తింటూ ఉంది. నోటి వెంబడి ఆ పాము వేలాడుతూ ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియోను ఫిగెన్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోతోపాటు.. నేను మొదటిసారిగా ఒక జింక పామును తినడం చూశాను. జింక గడ్డి తినలేదా..? అనే కామెంట్ ను దానికి ట్యాగ్ చేశారు. దీనిని రీట్వీట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి.. ‘అయోమయంలో దిక్కుతోచని జింకగా కనిపిస్తోంది’ అంటూ పోస్ట్ చేయడం గమనార్హం.

    వందలాదిగా వస్తున్న కామెంట్లు..

    ఈ వీడియోకు వందలాదిమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘మొక్కలు తినడం విసుగు చెంది ఉండవచ్చు. అందుకే సరికొత్తగా జింక ట్రై చేసింది’ అంటూ పలువురు కామెంట్ చేస్తే.. ‘జింక పాము వెన్నెముకను తినదు. కనుక ఇది పొరపాటున ఆహారం కావచ్చు. ఆ తర్వాత ఎలాంటి ప్రభావాలు ఏర్పడతాయో ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి. ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చు’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ‘పొరపాటున ఆహారంగా తీసుకుంటుందా..? లేక సరికొత్తగా ట్రై చేసిందా..’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.