Viral Photo: ఇటీవల కాలంలో పజిల్స్ కు ప్రాధాన్యం పెరుగుతోంది. అవి పెట్టే సస్పెన్స్ ను కొందరు ఎంజాయ్ చేస్తారు. కొందరైతే తల బాదుకుంటారు. అయినా ఇంకొందరైతే దాన్ని కనిపెట్టాలని తల బద్దలు కొట్టుకుంటుంటారు. పజిల్స్ ఇష్టపడేవారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఆదివారాలు పేపర్లలో వచ్చే పజిల్స్ కాకుండా ఇటీవల కాలంలో బొమ్మల పజిల్స్ ఎక్కువగా వస్తున్నాయి. దీంతో మెదడుకు మేత పెడుతున్నారు. పజిల్ లో ఇచ్చిన విధంగా కనిపెట్టే వరకు విశ్రమించడం లేదు.

తెలుగు భాషపై పట్టున్న వాళ్లు పత్రికల్లో వచ్చే పజిల్స్ పై ఫోకస్ పెడుతుంటారు. అందులో వచ్చే అర్థాలు గమనిస్తూ నింపుతూ పోతుంటారు. కానీ చిత్రంలో ఉండే పజిల్స్ మరో రకంగా ఉంటాయి. ఇక్కడ ఓ చిన్న విషయం ఇచ్చి దాన్ని కనిపెట్టాలని అడుగుతారు. దీంతో పజిల్స్ పట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు.
సామాజిక మాధ్యమాల్లో ఫొటో ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలివితేటలకు పరీక్ష పెడుతున్నారు. దీనికి స్పందన కూడా బాగానే వస్తోంది. కానీ పజిల్స్ పరిష్కరించడం అంత సులువు కాదని తెలిసినా తమ మెదడును ఉపయోగించుకుంటూ ముందుకు పోతున్నారు. చిత్రంలో చెప్పిన విధంగా అది ఎక్కడ ఉందో వెతుకుతున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న ఫొటో పజిల్స్ తికమకగా ఉంటున్నాయి. మీ చూపుల్లో పదును, బుర్రలో చురుకుదనం ఉంటేనే సాధ్యం అవుతుంది. ఫొటో పజిల్స్ సాల్వ్ చేసేందుకు కొందరు శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో సూచించిన దాన్ని కనిపెట్టే క్రమంలో మెదడుకు పని చెబుతున్నారు. తాజాగా ఇక్కడ ఇచ్చిన ఫొటోలో ఓ కొండ చిలువ ఉంది. దాన్ని కనిపెట్టాలని పజిల్ పెట్టారు. చెత్తలో ఎక్కడో కొండ చిలువ దాగి ఉందని దాన్ని కనిపెట్టాలని చెబుతున్నారు. దీంతో దాన్ని కనిపెట్టేందుకు మెదడుకు పని చెప్పి కనుగొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.