AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటులో పారదర్శకత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నూతన జిల్లాల ఏర్పాటులో ఏదో ఘనతగా చెప్పుకుంటూ ఒంటెత్తు పోకడతో పోతున్నారని విమర్శిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ఏ విలువలు పాటించలేదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని దుయ్యబట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటులో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అసంబద్ధంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కొత్త జిల్లాల ఏర్పాటులో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

హిందూపురం జిల్లా కేంద్రం చేయాలని సూచించినా పట్టించుకోలేదు. ఫలితంగా పలు చోట్ల సొంత పార్టీ నేతలే వైసీపీని అసహ్యించుకుంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో చంద్రబాబు వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ఏ ప్రమాణాలు పాటించారో తెలియడం లేదు. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై విమర్శలు పెరుగుతున్నాయి.
Also Read: మోడీజీ కనికరించండి.. మళ్లీ అప్పు కోసం ఢిల్లీకి జగన్.. ఇక మారరా..?
ఇక పన్నుల రూపంలో ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. ఆదాయ సమీకరణకు అడ్డదారులు తొక్కుతున్నారు. విద్యుత్ చార్జీలతోపాటు ఆస్తి పన్ను విపరీతంగా పెంచుతున్నారు. దీంతో సామాన్యుడు కుదేలైపోతున్నాడు. ఇప్పటికే పెట్రో భారంతో తీవ్రంగా నష్టపోతున్న వారిని పన్నుల రూపంలో పరేషాన్ చేస్తున్నారు. త్వరలో జనంపై బాదేందుకు ఇంకా పలు రకాల పన్నులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజలపై పన్నుల భారం మోపేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. సీపీఎస్ రద్దు విషయంలో ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులకు అండగా ఉంటామని చెప్పి తరువాత వదిలేయడం దారుణం. మరోవైపు అమరావతి విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహమేమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్ పాలనలో అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో జగన్ కు భంగపాటు తప్పదనే వాదనలు వస్తున్నాయి.
Also Read: ఢిల్లీ బాటలో కేసీఆర్, జగన్ లు.. ఒకరు కయ్యానికి.. ఇంకొకరు సఖ్యతకు..