
ఇద్దరు పిల్లలైనా కూడా తల్లిలా.. ఆంటీలా కనిపిస్తోందా? అనసూయ.. ఏమా అందం.. చందం.. బుల్లితెర జబర్ధస్త్ పై ఆడిపాడడమే కాదు.. వెండితెరపై కూడా సినిమాల్లో మెరుస్తూ అనసూయ అందానికి ప్రతీకగా నిలుస్తోంది. తాజాగా మరోసారి పిచ్చెక్కించేలా పింక్ సారీలో అనసూయ అందాలు ఆరబోసింది. అనసూయ కౌగిలిలో బంధీ అయిన పింక్ సారీకి ఎంత అదృష్టమో అంటూ ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు బోలెడు కామెంట్స్ చేస్తూ ఫిదా అవుతున్నాయి.
అనసూయ సోషల్ మీడియాలో స్పోర్టివ్ గానే ఉంటోంది. కొన్ని కామెంట్లను పట్టించుకున్నా.. మరికొన్నింటికి మాత్రం సమాధానం ఇస్తోంది. కుర్ర హీరోయిన్ కి పోటీనిచ్చేలా అందంగా తయారవుతున్న అనసూయను చూసి స్టార్ హీరోయిన్లు కుళ్లుకుంటున్నారని కొందరు కామెంట్లు చేయడం విశేషం.
తెలుగు నాట పాపులర్ యాంకర్ అయిన అనసూయకు ఇప్పుడు స్టార్ హీరోయిన్ లెవల్లో అభిమానం ఉంది. టీవీ షోలతో టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఈ భామ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది.
మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందచందాలను ఆరబోస్తూ నిద్రలేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అనసూయ హాట్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. అవి వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు పింక్ సారిలో కనిపించి అందరినీ మురిపించింది.
క్షణం, రంగస్థలం తదితర సినిమాల్లో నటించిన అనసూయ తాజాగా రవితేజ ఖిలాడీ, అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తోంది. కొన్ని ఫోటోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా సినిమా చిత్రీకరణ ఆగిపోవడంతో జబర్ధస్త్ కే పరిమితమైంది. ప్రస్తుతం ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండకుండా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. తాజాగా గులాబీ రంగు చీరలో అనసూయ అందాలు చూస్తే యూత్ కు నిద్ర కరువవుతుంది అనే చెప్పాలి.