
దేశ రాజధానిలో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గడంతో మే 31నుంచి దశల వారీగా లాక్ డౌన్ నియంత్రణలను సడలిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రజలు కరోనా బారినపడకుండా కాపాడటంతో పాటు వారు ఆకలితో చనిపోయే పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉందని అన్నారు. ఢిల్లీలో మే 31 నుంచి దశలవారీగా అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.