వైరల్: ఈ హీరో ఎవరో గుర్తుపట్టండి?

ఢిల్లీకి రాజైనా ఓ తల్లికి కొడుకే. టాలీవుడ్ లో యువ హీరో అయినా కూడా ఆ తల్లి ముద్దుబిడ్డనే. తల్లి పుట్టిన రోజును పురస్కరించుకొని చిన్నప్పుడు అమ్మతో దిగిన ఫొటోను హీరో నితిన్ పంచుకున్నాడు. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా నితిన్ ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. చిన్నప్పుడు చంటిబిడ్డగా ఉన్న నితిన్ ను పట్టుకొని ఉన్న ఆయన తల్లి ఫొటోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తన మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు […]

Written By: NARESH, Updated On : May 5, 2021 9:24 pm
Follow us on

ఢిల్లీకి రాజైనా ఓ తల్లికి కొడుకే. టాలీవుడ్ లో యువ హీరో అయినా కూడా ఆ తల్లి ముద్దుబిడ్డనే. తల్లి పుట్టిన రోజును పురస్కరించుకొని చిన్నప్పుడు అమ్మతో దిగిన ఫొటోను హీరో నితిన్ పంచుకున్నాడు.

తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా నితిన్ ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. చిన్నప్పుడు చంటిబిడ్డగా ఉన్న నితిన్ ను పట్టుకొని ఉన్న ఆయన తల్లి ఫొటోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

తన మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ నితిన్ ఈ అరుదైన పాత ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో అమ్మాయిలా జట్టు వేసుకొని నితిన్ ముద్దొస్తున్నాడు.

నితిన్ పూల చొక్కా వేసుకొని చిన్న నెక్కరుతో పెద్ద బొట్టుతో కనిపిస్తున్న చిన్నోడు ఇప్పుడు నితిన్ అంటే ఎవరూ నమ్మడం లేదు. కానీ ఆ పోలికలు చూస్తే అచ్చం అలాగే ఉన్నాయి. బుల్లి నితిన్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.